మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి.. అంతలో ప్రియురాలు ట్విస్ట్?

frame మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి.. అంతలో ప్రియురాలు ట్విస్ట్?

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది యువకులు ప్రేమ అంటూ ఆడపిల్లల వెంట పడుతున్నారు. ఇక ఆ తర్వాత మాయ మాటలతో మాటలు కలుపుతున్నారు. ఇక ఎన్నో కల్లబొల్లి మాటలతో కూల్ చేస్తూ చివరికి ఇక పెళ్లి పేరుతో మోసగించి నడిరోడ్డుపై వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే సాధారణంగా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటాం  ప్రియురాలిని మోసం చేసి ప్రియుడు మరో మహిళతో పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఇక అదే సమయంలో ప్రియురాలు వచ్చి ఏకంగా పెళ్లి మండపంలో ఆపండి అంటూ పెద్ద డైలాగులు చెబుతూ ఉంటుంది. ఇక ఆ సమయంలో పెళ్ళికొడుకు కంగారు పడటం.. అక్కడున్న వారందరూ షాక్ అవ్వడం లాంటి సన్నివేశాలు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.



 కానీ ఈ మధ్య కాలంలో మాత్రం.. ఏం చేస్తాం కలికాలం నిజజీవితంలో కూడా అలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చి అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఇక్కడ ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిని దక్కించుకోవడానికి  ఎంతో ధైర్యం చేసింది. సాధారణంగా అయితే  ఇంట్లో వాళ్లకు ఏదైనా చెప్పడానికి భయపడిపోతుంటారు అమ్మాయిలు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఏకంగా పెళ్లి మండపానికి వచ్చేసింది. తాను ప్రేమించిన యువకుడు కి వేరే యువతితో పెళ్లి జరుగుతుంటే సహించలేక  పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇచ్చి ఆపండి అంటూ ఒక డైలాగ్ చెప్పేసింది.



 ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. సరిగ్గా తాళి కట్టడానికి కొన్ని నిమిషాల ముందు ప్రియురాలు ఇలాంటి పని చేసి అందరికీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా మాలకొండ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన మహేష్ అనే యువకుడు అదే  ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగి తేలాడు. ఆ తర్వాత పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు అంటూ కారణం చెప్పి తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఇక ప్రియురాలికి తెలియకుండా మరో మహిళ మెడలో తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు.  ఈ విషయం తెలుసుకున్న యువతి ఇక పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇచ్చి పెళ్లి ఆగిపోయేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: