ప్రియుడి మోజులో భ‌ర్త‌ను క‌డ‌తేర్చిన భార్య‌..?

praveen
వివాహేత‌ర సంబంధాలు ఎన్నో కుటుంబాల‌ను ఛిద్రం చేస్తున్నాయి. ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకుంటున్నాయి. ఇక ఇదే కోవ‌లో ఇప్పుడు మ‌రో ఘ‌ట‌న అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతోంది. వివాహేతర సంబంధంతో ప్రియుడి మోజులో ప‌డ్డ ఆమె భర్తనే కడతేర్చింది. ఈ ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో రీసెంట్ గా వెలుగుచూసింద‌ని తెలుస్తోంది.

వివ‌రాల్లోకి వెళ్తే ఈ నెల 3న తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలోని బొడ్లంక గ్రామంలో  ఓ వ్యక్తి శ‌వం అనూహ్యంగా లభించింది. కాగా పోలీసుల విచారణలో మృతుడిని రాజమహేంద్రవరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గ‌ల సుబ్బారావుపేటకు చెందిన ఎ.ప్రసాద్‌‌గా పోలీసులు గుర్తించార‌ని తెలుస్తోంది. అయితే ఆయ‌న్ను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి విచార‌ణ జ‌రుపుతున్నారు. కాగా ఈ విచారణలో భాగంగా పోలీసులు ప్రసాద్ భార్య అంబికను అనుమానంతో ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింద‌ని స‌మ‌చారం.

ఇక పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ‌ని స‌మాచారం. అయితే అంబిక కొంతకాలంగా లింగంపేటకు చెందిన వ్య‌క్తి చక్రిదొరతో అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని సైలెంట్‌గా కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భ‌ర్త ప్రసాద్ పద్ధతి మార్చుకోవాలని చాలా సార్లు భార్యను హెచ్చరించినా ఫ‌లితం లేదు. ఇక తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా అడ్డు తొల‌గించుకోవాల‌ని భావించిన ఆమె ప్రియుడితో కలిసి ప‌క్కా ప్లాన్ వేసింది.

ఇక వారిద్ద‌రూ అనుకున్న‌దే త‌డ‌వుగా ప్రసాద్‌కు సుబ్బారావుపేటకు చెందిన తన తోడల్లుడు ఎం.శ్రీకాంత్‌‌తో కొన్నాళ్లుగా గొడవలున్నాయ‌న్న విష‌యాన్ని వారు ఆస‌రాగా చేసుకున్నారు. ఇక ప్రసాద్‌ను హత్య చేసేందుకు అంబిక, ఆమె ప్రియుడు శ్రీకాంత్‌ను క‌లిసి ఈ విష‌యంపై పూర్తిగా మాట్లాడారు. వారంతా ప‌థ‌కం ప్రకారం శ్రీకాంత్ వెంట‌నే ప్రసాద్‌కు ఫోన్ చేసి గొడవలన్నీ మరిచిపోదాం, అని చెప్పి నమ్మ‌బ‌లికాడు. కాగా వారిద్ద‌రూ జూన్ 30న ప్రసాద్‌ను మారేడుమిల్లి విహారానికి తీసుకెళ్లి ఫుల్‌గా మందు తాగించారు. ఆ త‌ర్వాత మత్తులో ఉన్న ప్రసాద్‌పై బండరాయితో తలపై మోది వారంతా క‌లిసి ఆయ‌న్ను చంపేశార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: