హత్య చేసి.. కరోనా ఉందన్నాడు.. ఇక చివరికి?

praveen
భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్..  కానీ నేటి రోజుల్లో మాత్రం భార్య భర్తల బంధం అంటే హత్యలు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.  కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలవాల్సిన భార్య భర్తలు ఏకంగా కట్టుకున్న వారిని కష్టాలపాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఎంతోమంది పరాయి వ్యక్తుల మోజులో పడి  కట్టుకున్న వారిని కడ తేరుస్తున్నారు. మరికొంత మంది ఇతర కారణాలతో కట్టుకున్న వారి పాలిట కాలయముడయ్యాడుగా మారిపోతున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చూస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 భార్యను ఎన్ని రోజులనుంచి హతమార్చాలని ఆ భర్త ప్లాన్ వేసాడో తెలియదు కానీ ఇక ఇటీవలే కరోనా వైరస్ మాత్రం అతనికి కలిసొచ్చింది.  భార్యను దారుణంగా హత్య చేసి ఆ తర్వాత కరోనా వైరస్ సోకి చనిపోయింది అని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడు.  మూడు ముళ్ళు వేసి కష్టసుఖాల్లో కడవరకు తోడు ఉంటానని ప్రమాణం చేసిన వాడు సంతోష పెడుతాడు అనుకుంటే ఆ మహిళ ఆశలను చిదిమేసిన దారుణంగా ప్రాణం తీశాడు. ఆ భార్య వద్దు వద్దు అంటూ ఎంతగా బ్రతిమలాడినా ఆ భర్త మనసు మాత్రం పెరగలేదు చివరికి భార్యను దారుణంగా హత్య చేసి కరోనా వైరస్ మరణంగా చిత్రీకరించాడు.



 ఈ ఘటన హైదరాబాద్లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. విజయ్ కవిత అనే భార్య భర్తలు హైదరాబాదులో నివాసముంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే ఇటీవలే కవిత అకస్మాత్తుగా చనిపోయింది. అయితే తన భార్యకు కరోనా వైరస్ సోకిందని చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయింది అంటూ అందరినీ నమ్మించే వాడు.ఇక ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు జరిపించాడు..  అయితే కవిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. భర్తని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో  భార్యను హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు భర్త విజయ్ ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: