ప్రేమజంట సూసైడ్.. వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టారో తెలుసా?
ఆ యువతీ యువకులు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా ఉండాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కనీసం చావులో అయిన ఒకటిగా ఉండాలి అనుకున్నారు. చివరికి బ్యారేజ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి బ్యారేజ్ వద్ద ప్రేమ జంట నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇక పోలీసులకు ఈ దీనిపై సమాచారం అందడంతో గజ ఈతగాళ్లు సహాయంతో ప్రేమ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు నలభై రెండు గంటల తర్వాత మృతదేహాలు నది లో పైకి తేలడంతో ఇక ఈతగాళ్లు మృతదేహాలను బయటకి తీసుకొచ్చారు .
నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట బొబ్బిలి కి చెందిన రాజేష్ కురుపాం కు చెందిన బాలిక గా పోలీసులు గుర్తించారు. తోటపల్లి బ్యారేజీ వద్ద కు ఇద్దరు కూడా స్కూటీపై వచ్చినట్లు చెబుతున్నారు. ఇక మొదట అక్కడ భారీ వద్ద కాసేపు కూర్చొని ముచ్చటించారు అని స్థానికులు చెబుతున్నారు. ఇక ఆ తర్వాత ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. అయితే ఇక ఆ వీడియోలో తాము చనిపోవడానికి కారణం ఎవరు అనే విషయాన్ని చెప్పారు. తమ చావుకు తన బావ మౌళి కారణమంటూ ఆ బాలిక చెప్పింది. ఇక ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టింది. తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చున్నీతో కట్టుకొని నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇక ఇద్దరు మృతి తో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.