
ఎమ్ఆర్ఓపై డీజిల్ పోసిన రైతులు.. కాని అంతలోనే?
ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాని అధికారుల వ్యవహారశైలిని లో మాత్రం ఎక్కడా మార్పు రాలేనట్టు అర్థమవుతుంది. ఇక ఇటీవలే ఒక తహసిల్దార్ కార్యాలయంలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి రైతులు ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవలే రైతులు ఏకంగా ఎమ్మార్వో పైన డీజిల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. కానీ త్రుటిలో ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు రావాల్సిన రైతు బీమా ఆగిపోయింది అంటూ ఆందోళన చేపట్టిన రైతు ఎమ్మార్వో తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో మాలోతు బాలు అనే రైతు ఇటీవలే కరెంట్ షాక్ తో మృతి చెందాడు. అయితే అతని పేరు మీద కొంత భూమి ఉంది. కానీ కొత్త పట్టా పాస్ బుక్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయితే ప్రభుత్వం ఇస్తున్న రైతు బీమా డబ్బులు వస్తే కుటుంబానికి ఉపయోగపడతాయని మిగతా రైతులు భావించారు. ఇక అతని పేరుపై ఎలాంటి పట్టా పాస్ బుక్ రాకపోవడంతో రైతు బీమా కి అనర్హులడిగా తేలాడు మృతుడు. ఈ నేపథ్యంలోనే రైతులు శివంపేట తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. రైతులు ఆందోళన చేపడుతున్నప్పటికి తహసిల్దార్ మాత్రం పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆయనపై డీజిల్ పోశారు. ఈ క్రమంలోనే నిప్పంటించేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైతులను నివారించారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.