దొంగలమని నమ్మించి.. చివరికి అలా దోచుకున్నారు..
అంతేకాదు గతం లో ప్రభుత్వ అధికారులు అంటూ చెప్పి దోచుకున్న ఘటనలు లేకపోలేదు.. తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది.. పోలీసులమని బెదిరించి బంగారాన్ని దుండగు లు దోచుకెళ్లారు. ఈ సంఘటన రాయపర్తి మండలం లోని జయ రాంతండ క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పోలీసులమ ని చెప్పి శివశంకర్ అనే వ్యక్తి నుంచి సుమారు రూ.3 లక్షల విలువ చేసే 7 తులాల బంగారాన్ని దుండగులు అపహరించారు..
వివరాల్లోకి వెళితే.. శివ శంకర్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లోని నగల వ్యాపారి రవీంద్రచారి వద్ద గుమస్తాగా పని చేస్తున్నాడు. అతను వివిధ ప్రాంతాలకు వెళ్లి బంగారు నగలను అందచేసేవారు. ఇప్పుడు కరోనా కారణంగా కొనుగోళ్లు తగ్గడంతో అతనే స్వయంగా దుకాణానికి నగలను తీసుకెళ్లేవారు.. కాగా, వరంగల్ నుంచి శివ శంకర్ బంగారం తో తొర్రూరు వెళ్తుండ గా మార్గమధ్యం లో ఈ సంఘటన జరిగింది. రాయపర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని బంగారం తో పారి పోయిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఆ ప్రాంతాల్లో లెక్క లేనన్ని జరిగినట్లు పోలీసులు గుర్తించారు.