స్టూడెంట్ పై కన్నేసిన పీటీ మాస్టర్.. చివరికి..?

praveen
ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఉన్నతమైనది. చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి పెరిగి పెద్దవ్వడానికి ఒక బీజం పోసే విధంగా ఉపాధ్యాయులు తమ పాటలతో బోధిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఒక విద్యార్థి సన్మార్గంలో నడవడానికి ఇక ఉపాధ్యాయులే ఆదర్శం గా మారి పోతూ ఉంటారు. ఇలా విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ నేటి బాలలను రేపటి పౌరులు గా తీర్చి దిద్దుతూ ఉంటారు ఉపాధ్యాయులు. అందుకే విద్య వృత్తి ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు.  కానీ నేటి రోజుల్లో మాత్రం ఇలా ఎంతో మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు నీచానికి పాల్పడుతూ ఏకంగా టీచర్ వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.

 విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్లే ఏకంగా విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నారు. ఇక్కడ ఒక పిటి మాస్టర్ ఇలాంటి వక్రమార్గం పట్టాడు. విద్యార్థులకు మంచి చెప్పాల్సింది పోయి తన బుద్ధిహీనతను బయట పెట్టుకున్నారు. చివరికి హోదాను మరిచి దారుణంగా వ్యవహరించాడు.ప్లస్ వన్ బాలిక పై కన్నేశాడు ఇక్కడ ఒక పి టి మాస్టర్. అంతేకాదు ఆ విద్యార్థిని వివాహం చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసి కిడ్నాప్ కూడా చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అయితే పక్కా ప్లాన్ వేసినప్పటికీ చివరికి పిటి మాస్టర్ ప్లాన్ మాత్రం బెడిసికొట్టింది

 కృష్ణగిరి జిల్లా చిత్తూరు సమీపంలోని ఓ  వ్యక్తి కి 16 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె ప్రస్తుతం ప్లస్ వన్ చదువుతోంది. ఇటీవలే ఆ విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. దీనిపై విద్యార్తిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలోనే ఊహించని నిజం బయటపడింది బాలికపై పిటి మాస్టర్ కన్నేసినట్లు తెలుసుకున్న పోలీసులు ఇక ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం బయటపడింది. సిటీ మాస్టర్ గా ఉన్న చరణ్రాజ్ యువతిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది తనకు వయసు అయిపోతున్నా ఇంకా పెళ్లి జరిగడం లేదని అందుకే బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను ఉంటే పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కటకటాల వెనక్కు తోసారూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: