విశాఖలో టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే..!

Suma Kallamadi
సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశంతో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా భార్యతో ఏర్పడిన చిన్న చిన్న పొరపొచ్చాల వల్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టిక్ టాక్ టోనీగా నెట్టింట ఫేమస్ అయిన ఆ కుర్రాడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వాట్సప్ లో చివరి స్టేటస్ పెట్టి మరీ సెలవ్ అంటూ అందరికీ గుడ్ బై చెప్పాడు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా భీమిలి బీచ్ రోడ్డు మంగమూరికిపేటకు చెందిన 25 ఏళ్ల గరికిన తాతారావు అలియాస్ టోనీ సిటీలలోని ఓ బిర్యానీ పాయింట్ లో పనిచేస్తుంటాడు. అతడు టిక్ టాక్ వీడియోల ద్వారా చాల ఫెమస్ అయ్యాడు. తాతారావుకి నాలుగు నెలల క్రితతం అతడికి శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలోని మరువాడ గ్రామానికి చెందిన పావని అనే యువతితో పెళ్లయింది. అతడి భార్య గర్భం దాల్చింది. దీంతో మొదటి కాన్పునకు సంబంధించిన ఖర్చులను తామే భరిస్తామని చెప్పి పావని తండ్రి ఏప్రిల్ ఐదున తన కూతురిని తీసుకెళ్లిపోయాడు.

ఇక రోజులాగే డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన అతడు తన అక్క, అన్న పిల్లలతో సరదాగా గడిపాడు. ఇక తన గదిలో ఒక్కడినే పడుకుంటా అని చెప్పడంతో కుటుంబ సభ్యులు పెద్ద కుమార్తె కొడుకును టోనీ గదిలో పడుకోమని చెప్పి పంపించారు. ఇక సతీష్ ఉదయాన్నే లేచేసరికి టోనీ ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. దీంతో భయాందోళనకు గురైన సతీష్ బిగ్గరగా కేకలు వేశాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి టోనీ విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు.

అతడు చనిపోవడానికి భార్యతో వచ్చిన చిన్నచిన్న మనస్పర్థలే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ‘ఇక టోనీ నువ్వు నా మాట వినవు కదా.. ఇక సెలవు’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టోనీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య పావని పుట్టింటికి వెళ్లి వచ్చాక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: