ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై ఐదు రూపాయలు చేతిలో పెట్టి..!?

N.ANJI
సమాజంలో మహిళలకే కాదు.. చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కామంతో మృగాలగా మారి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ అయోధ్య నగర్ కు చెందిన 8ఏళ్ల బాలిక శనివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. అయితే ఆ బాలిక వద్దకు నేరుగా ఓ వ్యక్తి వచ్చాడు. ఆమెకు ఓ వంద రూపాయలు ఇచ్చాడు. కాస్త దూరంలో ఉన్న దుకాణానికి వెళ్లి వంద రూపాయలను ఇచ్చి పొగాకు పొట్లాలను తీసుకురమ్మని చెప్పాడు. ఆ బాలిక కూడా అదే పనిచేసింది.

అయితే పొగాకు పొట్లాలు తీసుకొచ్చి అతడికి ఇవ్వబోతే.. ‘నాకు కాదు, కాస్త దూరంలో మరో వ్యక్తి ఉన్నాడు. అతడికి ఇవ్వు‘ అని చెప్పాడు. ఆమె అతడు చెప్పిన దిశగా వెళ్తోంటే, ఆ పాప వెంటే నడుస్తూ వెళ్లాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమెను చెత్తకుప్పల్లోకి లాక్కెళ్లాడు. నోరు మూసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెకు ఐదు రూపాయలు ఇచ్చి, విషయం ఎవరికీ చెప్పొద్దనీ, చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఇక ఆ పాప ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. ఆ పాప తల్లి ఏంటని అడిగితే.. తెలిసీ తెలియని మాటలతో జరిగింది చెప్పింది. దీంతో వెంటనే ఆ బాలికను తీసుకుని అయోధ్య నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. విషయం చెప్పి కేసు నమోదు చేసుకుంది. పాపకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. అతడెవరన్నది పాపను అడిగారు.

అయితే గతంలో అతడిని తాను చూడలేదనీ, రెండుసార్లు మాత్రమే చూశానని చెప్పడంతో పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. చివరకు ఆ ప్రాంతంలో ఆ రోజు తిరిగిన 40 మంది పొటోలను చూపించగా, రవి అనే 30 ఏళ్ల వ్యక్తిని గుర్తించింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతడికి గతంలోనే పెళ్లయిందనీ, కుటుంబ కలహాల వల్ల విడిగా ఉంటున్నారని విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: