తల్లిపై అఘాయిత్యం.. టీవీ నటుడి నిర్వాకం..?

P.Nishanth Kumar
ఈరోజుల్లో మానవసంబంధాలు మంటకలిసిపోతున్నాయి. విలువలు తగ్గిపోతున్నాయి.. తమకు కోరిక కలిగితే పక్కన ఉన్నది ఎవరో అని కూడా చూడట్లేదు. కన్న తల్లి ని సైతం వదలని కామాంధుల దుశ్చర్య ను మనం చూస్తూనే ఉన్నాం.. వావి వరసలు మరిచి కుటుంబ సభ్యులనే చెరిచేస్తున్న ఈ ఘటనలు రోజు రోజు కు పెరిగిపోవడంతో ఈ సమాజం ఎటువైపు కి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఇంట్లో వాళ్ళు బయటకి చెప్పుకునే పరువుపోతుందని భయపడిపోతుంటే ఈ కామాంధులు మరింత రెచ్చిపోతూ వారిలో సహనాన్ని పరీక్షిస్తున్నారు.. ఆడవారిపై ఈ అఘాయిత్యాలు రోజు రోజు కి ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వీరి ఆగడాలు ఎక్కువయిపోతున్నాయి.. ఆడది కనిపిస్తే అందుకే అన్నట్లు చూసే ఈ కళ్ళు ఇప్పుడు ఒకే మెట్టు ఎక్కి వారి జీవితాలని నలిపేయడానికి సిద్ధమవుతున్నారు. .

తాజాగా ఓ సీరియల్ నటుడు తన సవితి తల్లిపై అఘాయితాయనికి పాల్పడ్డాడు. ముంబై లో పలు సీరియల్స్ లో నటించిన ఈ కామాంధుడు ఇలా చేయడం సమాజం తలదించుకునే ఘటన.. ఎవరు లేని సమయంలో బలవంతంగా ఆ పనిచేశాడు. ముంబై లోని ఓ ప్రముఖ దర్శకుడికి ముగ్గురు భార్యలు కాగా అతని కొడుకు ముగ్గురి భార్యలలో ఒకరైన సవితి భార్యపై కన్నేశాడు. వరసకు తల్లి అయ్యే ఒక ఆవిడ పట్ల వ్యామోహన్ని పెంచుకున్న ఈ నటుడు బంధాలు మరచి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడట.

అంతే కాకుండా ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు కూడా దోచుకుని పారిపోయాడు.కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు నిందితుడికి, బాధితురాలికి మధ్య ఏమైనా ఆస్తి వివాదాలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. సమాజంలో ప్రముఖ స్థానంలో ఉన్నవారే ఇలా చేస్తుండడంతో సామాన్యులకు వారు ఏం ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: