చీపురు కట్టతో... అత్తగారు, భార్య కొట్టారని... ఆత్మహత్య

Sahithya

భార్యా భర్తల మధ్య గొడవలు అనేవి చాలా వరకు సహాజం. చాలా వరకు కూడా గొడవలు అనేవి టీ కప్పులో తుఫానుగా ఉంటే మరి కొన్ని విడిపోయే విధంగా ఉంటాయి. భార్య మీద ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తూ ఉంటారు గాని... తిరిగి భార్య దాడి చేస్తే మాత్రం భర్త తట్టుకుని నిలబడటం అనేది కష్టం. భార్య భర్త పై దాడి చేసే సంఘటనలు చాలా వరకు తక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఒక ఘటన జరిగింది. అయితే అవమాన భారం తట్టుకోలేక భర్త మరణించాడు. భార్య కొట్టింది అని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

 

అసలు ఏం జరిగింది ఏంటీ అనేది చూస్తే... 20 ఏళ్ళ క్రితం సౌమిత్ర అనే వ్యక్తికి తన బంధువుల అమ్మాయితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు ఈ ఇద్దరు. ఆ తర్వాత కొంత కాలానికి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు బాగానే ఉన్నారు గాని... ఆ గొడవలో భార్య కాస్త అవమాన పరిచే విధంగా భర్తను మాట్లాడింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.  ఈ నేపధ్యంలో... భార్య తన భర్త మీద చీపురు కట్టతో దాడి చేసింది. అత్త గారు కూడా చీపురుతో కొట్టారు. 

 

ఆ అవమానం భరించలేక అతను శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన నివాసం లోనే అర్ధరాత్రి సమయం లో  ఉరేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతని తని తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భార్యను, అత్తగారిని అదుపులోకి తీసుకున్నారు. మాకే పాపం తెలియదు అని తల్లీ కూతుళ్ళు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏది ఎలా ఉన్నా సరే ఈ ఘటన మాత్రం ఎన్నో పాఠాలు నేర్పింది కొందరికి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: