శుభవార్త: తగ్గుతున్న వంట నూనెల ధరలు?

VAMSI
ఇటీవల వంట నూనెల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దాంతో సామాన్యులకు చుక్కలు కనపడ్డాయి. ఓ వైపు నిత్యావసరాల ధరలు, మరో వైపు పెట్రోల్ - డీజల్ ధరల పెంపు బాదుడే బాదుడు అన్నట్టు భారంగా మారితే. వాటితో పాటు వంట నూనెల ధరలు కూడా పెరగడంతో అందరికీ ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా సామాన్యులకు నెత్తిపై పిడుగు పడ్డట్లు అయ్యింది. దీనికి రష్యా - ఉక్రెయిన్ ల మద్య జరుగుతున్న యుద్ద ప్రభావం కూడా పడటంతో స్థానికంగా వ్యాపారస్తులు నూనె ధరలను వారికి నచ్చినంత పెంచేయడం మరో సమస్యగా మారింది. నూనె ధరలు వెంటనే తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేసినా లాభం లేకుండా పోయింది.
అయితే ఇపుడు వినియోగ దారులకు కాస్త ఊరటనిచ్చే వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం వంట నూనెల ధరలు బాగా తగ్గాయి. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని  దేశంలో వంట నూనెల ధరలను అరికట్టేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అన్ని శుద్ది చేసినటువంటి  చేసినటువంటి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దాంతో వంట నూనెల ధరలు దిగొచ్చాయి. గత వారం నుండి వంట నూనెల ధరల్లో తగ్గింపు మొదలయ్యింది. ముందుగా గత వారం సోయాబీన్ నూనె ధరలు బాగా తగ్గాయి. అయితే ఈ క్రమంలో వేరుశెనగ ధరలు సైతం పడిపోవడంతో రైతులు పండించిన పంటను తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధంగా లేరని వ్యాపారస్తులు చెబుతున్నారు.
అయితే ఈ కొరత కారణంగా వేరుశనగ ధరలు అటుఇటుగా సాగిన ఈ వారంలో మెరుగుపడ్డట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వేరుసెనగ నూనె ధరలు కూడా క్షీణించాయి. గతంతో పోలిస్తే ఈ వారం ధరలు తగ్గినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. సాధారణంగా చలికాలంలో క్రూడ్ పామాయిల్‌కు డిమాండ్ తక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే, దిగుమతి సుంకం తగ్గించడం కూడా వంట నూనెల ధరలు తగ్గడానికి ముఖ్య కారణం అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: