కరోనా వేళా.. ప్రోటీన్ లడ్డు కావాలా నాయనా..!!

N.ANJI

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికమవుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఇంటి ఫుడ్‌కే పరిమితమవుతున్నారు. హెల్తీ ఫుడ్.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ రోజు మనం కూడా ప్రోటీన్స్ అధికంగా ఉండే వంటకం గురించి తెలుసుకుందాం.


ప్రోటీన్ లడ్డుల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆరోగ్యానికి శక్తిని అందించే ఈ ప్రోటీన్ లడ్డుల తయారీ విధానం గురించి ఈ రోజు మనం చెప్పబోతున్నాము. ప్రోటీన్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు.. వేరు శనగలు – అరకప్పు, బాదం పప్పు – రెండు స్పూన్లు, నువ్వులు – అరకప్పు, పిస్తా – రెండు స్పూన్లు, గుమ్మడి గింజలు – రెండు స్పూన్లు, సన్‌ఫ్లవర్ గింజలు – రెండు స్పూన్లు, ఎండు కొబ్బరి – అరకప్పు, ఖర్జూర.. అంజీరా ముక్కలు – నాలుగు, బెల్లం – కప్పున్నర, మంచి నీళ్లు - పావు కప్పు తీసుకోవాలి.


ప్రోటీన్ లడ్డు తయారీ విధానం..

ముందు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో వేరు శనగరలు, నువ్వులు, పిస్తా, బాదం, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని బాగా వేయించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బయటికి మిక్సీ పట్టాలి. పొడిపొడిగా అయ్యాక అందులో కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఖర్జూర, అంజీర్ ముక్కలను జత చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులో బెల్లం, నీళ్లు కలిపి బాగా ఉడికించుకోవాలి. బెల్లం పాకం తయారయ్యాక.. మిశ్రమాన్ని అందులో కలపాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. కొంచెం చల్లారాక లడ్డులుగా చేసుకోవాలి. అంతే ప్రోటీన్ లడ్డూ రెడీ. ప్రోటీన్ తయారు చేయడం తెలిసిందిగా.. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: