ఇన్స్టంట్ టేస్టీ దోశ... ఈజీగా, లైట్ గా !

Vimalatha
తిండి ప్రియులు భారతదేశంలో కూడా చాలా ఎక్కువ. ఇక్కడ వంటకాలకు ఏమాత్రం కొరత లేదు. భారతదేశం స్పైసీ నుండి భారీ వంటకాలతో నిండి ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిండి ప్రియుల చూపు పడే దేశాల్లో భారతదేశంలో కూడా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఏమి తినాలో తెలియని గందరగోళానికి గురవుతారు. హెవీ, స్పైసీతో బోర్ కొట్టిన తర్వాత లైట్ గా ఉండే ఫుడ్ తినాలని అన్పిస్తుంది. లైట్ ఫుడ్ విషయానికి వస్తే సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే గుర్తుకు వస్తుంది. అది అల్పాహారం లేదా రాత్రి భోజనం అయినా... దక్షిణ భారత ఆహారాన్ని ఎప్పుడైనా రుచి చూడవచ్చు. ఇందులో ఇడ్లీ, సాంబార్, దోశ ఇతర ఆహారాలు ఉన్నాయి.
ఈ రోజు మనం బియ్యం పిండితో ఈజీగా, ఇన్స్టంట్ గా దోశ ఎలా చేయాలో తెలుసుకుందాం. వాస్తవానికి సాధారణ దోసెను తయారు చేయడానికి ఎక్కువ శ్రమ పడుతుంది. దీనికి సమయం కూడా పడుతుంది. చాలా సార్లు ప్రజలు ఈ కారణంగా దోశ చేయడం మానేస్తారు. కానీ ఈ దోశ తయారు చేయడం సులభం, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. విశేషమేమిటంటే దీన్ని తయారు చేయడానికి మీకు 15 నుండి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది.
కావలసిన పదార్థాలు :
ఒక కప్పు గోధుమ పిండి
కొద్దిగా బియ్యం పిండి
రెండు పచ్చి మిరపకాయలు
కరివేపాకు
జీలకర్ర
చాట్ మసాలా
వంటకం తయారీ :
ఒక పాత్రలో పిండిని తీసుకొని అవసరమైనంత నీరు కలపండి. ఇందులో బియ్యప్పిండి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ఎర్ర మిరపకాయ, జీలకర్ర వేసి, ఈ పిండిని బాగా కలపాలి. దోశ పిండిలా కలపాలి. వేయించడానికి పాన్ లోకి నూనె పోయాలి మరియు పిండి పోయాలి.పాన్ పై నూనె వేసి దోశను ఎలా వేస్తామో పిండితో అలా వేయండి. దోశ ఒక వైపు నుండి ఉడకనివ్వండి. పైన నూనె పోయాలి. ఇప్పుడు దోసను తిప్పండి. మరొక వైపు కూడా కాల్చుకుంటే సరి. దోశ సిద్ధం... చట్నీతో సర్వ్ చేయండి వేడివేడిగా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: