పిల్లలకు నచ్చే "స్వీట్ కార్న్ చపాతీ కట్ లెట్" చేయడం తెలుసా?

VAMSI
వర్షాకాలం వచ్చిందంటే ఇక నోటికి వేడివేడిగా స్నాక్స్ పడాల్సిందే.చల్లటి గాలులు మధ్య వేడిగా ఏదైనా స్నాక్ తినాలని అందరికీ ఉంటుంది. అయితే రెగ్యులర్ గా బజ్జీలో బోండాలో కాకుండా కాస్త కొత్తగా టేస్టీ గా స్నాక్ ఉండాలి అనుకునేవారికి ఇదో చక్కటి రెసిపీ. అదే స్వీట్ కార్న్ చపాతీ కట్లెట్. ఇది ఒక్కసాయిర్ మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా మీ ఇంట్లోకి అతిధులు వస్తే ఇవి కనుక చేశారంటే వారు మీకిక ఫ్యాన్ అయిపోవాల్సిందే. మరి ఇది ఎలా తాయారు చేస్తారో చూద్దామా.
కావల్సిన పదార్థాలు
 
గోధుమ పిండి - 250 gm
ఉడికించిన స్వీట్ కార్న్
ఆలూ 2
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి - 2
తరిగిన కొత్తిమీర - కొద్దిగా
నూనె -  డీప్ ఫ్రై కి సరిపడినంత
ఉప్పు -  తగినంత
కారం - ఒక టీ స్పూన్
గరం మసాలా పౌడర్ - పావు టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
ఎర్రగడ్డలు - సగం గడ్డను సన్న ముక్కలు చేసుకోవాలి
తయారు చేయు విధానం
 
* ముందుగా ఒక పావు కేజీ వరకు గోధుమ పిండిని చపాతీ పిండికి కలుపుకున్నట్లు ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఉడికించిన ఆలూని ఒక బౌల్ లోకి తీసుకుని స్పూన్ తో మెత్తగా స్మాష్ చేయాలి.
* అలాగే అందులో ఉడికించిన స్వీట్ కార్న్ ను, కట్ చేసిన పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాల,కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగిన యరగడ్డ ముక్కలను..తగినంత ఉప్పు వేసుకుని అన్నిటినీ ఒక మిశ్రమంలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
* ఇపుడు కలిపి ఉంచిన గోధుమ పిండిని చిన్న బాల్స్ గా చేసుకుని వాటిని చిన్న పూరి సైజ్ లో రుద్ది పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ ను వేసి కాగనివ్వాలి.
* తరువాత చపాతీల్లా గుండ్రంగా రుద్దిన వాటిని ఒక్కొక్కటిగా తీసుకుని అందులో ముందుగా తయారు చేసుకున్న ఆలు, స్వీట్ కార్న్ మిశ్రమాన్ని పెట్టి పొడవుగా ఒకవైపుకి నెమ్మదిగా మడుచుకొని అందులోని మిశ్రమం బయటకు రాకుండా నెయ్యి లేదా కాస్త నూనె పోసి ఫోల్డ్  చేయాలి.
* అలా అన్ని చేసుకున్న తరువాత కాగుతున్న నూనెలో వాటిని వేసుకుని  డీప్ ఫ్రై చేసుకోవడమే. అయితే వాటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఎర్రగా వేగనివ్వాలి.
* ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ వేసి ఫ్రై అయిన వాటిని అందులోకి తీసుకుని ఇక సర్వ్ చేసుకోవడమే.
మీ ముందు కరకరలాడే స్వీట్ కార్న్ చపాతీ కట్ లెట్స్ రెడీ. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వర్షాకాలంలో దీనిని తయారుచేసుకుని తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: