తాళికల పాయసం చేసేద్దామా

Manasa
గణపతి చతుర్థి స్పెషల్ తాళికల పాయసం ఎలా చేయాలో చూద్దామా....  

కావలసిన పదార్థాలు:
 గోధుమపిండి - 1/2 కె.జి
బెల్లం - 1/2 kg
నెయ్యి- 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్
ఎండు కొబ్బరి కుడకలు - ఒకటి
గసగసాలు : 50 గ్రామాలు
 వరి పిండి(బియ్యం పిండి) : 1 టేబుల్ స్పూన్
 నీళ్లు :తగినన్ని    
 పాలు: రుచికి సరిపడా
 ఉప్పు:చిటికెడు
తాళికల పాయసం తయారు  చేసే విధానం:
  1/2 కె.జి  గోధుమపిండిని తీసుకోవాలి. గోధుమపిండిలో సరిపడా నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి  కలుపుకోవాలి. అది ముద్దలా అయ్యాక  ఒక స్పూన్ నెయ్యి వేసి మల్లి కలుపుకొని  ఒక 15 నిమిషాలపాటు మూతపెట్టి పక్కకు పెట్టాలి.
15 నిమిషాల తర్వాత గోధుమపిండిని అటు మరి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మధ్యస్తంగా తాళికలు చేసుకోవాలి.ఆ ముద్దతో కొన్ని  చిన్న చిన్న బాల్స్ కూడా చేయాలి.
(చిట్కా:ఈ తాళికలు,చిన్ని వుండ్రాలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండాలంటే అది వేసిన ప్లేట్ లో కొంచెం పొడి గోధుమపిండిని పై పైన చల్లుకోవాలి.
గమనిక:తాళికలు పొడుగ్గా లైన్స్ లాగా చేసుకోవాలి).
ఒక మందమైన గిన్నెలో రెండు నుంచి మూడు గ్లాసుల నీళ్లు పోసుకుని వాటిని కాగనీయాలి. నీళ్లు మరిగాక మనం చేసి పెటుకున తాళికలు చిన్ని వుండ్రాలు నీళ్లలో వేసుకోవాలి.
(అది ఉడకడానికి 20 నిమిషాల సమయం పడుతుంది.)
ఈ లోపు ఇంకో గిన్నెలో కొన్ని నీళ్లు పోసి బెల్లం వేసి, దాన్ని కరగనివ్వాలి.
ఆ బెల్లం నీళ్లు వడకట్టాలి. ఎండు కొబ్బరి, గసగసాలు పేస్ట్గా చేసుకోవాలి.
ఉడుకుతున్న తాళికలో ఈ వడియ కట్టిన బెల్లం నీళ్లు, కొబ్బరి గజాల పేస్ట్, ఒక స్పూన్ బియ్యం పిండి ని నీళ్లలో కలిపి ఆ పాకంలో వేయాలి. 4  టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి గరిటతో కలుపుకొని ఒక 5 నిమిషాలపాటు ఉంచాలి.
గణపతి కి ఎంతో ప్రీతికరమైన తాళికల పాయసం రెడీ.
తినేటపుడు దీనిలో గోరు వెచ్చని పాలు పై నుంచి వేసుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: