అదృష్టం: ఆ కూర తిని టేస్ట్ చెప్పినందుకు 50 వేల జీతం..!

MOHAN BABU
 కొంతమందికి  అదృష్టమనేది వారి వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు ఏ విధంగా వారి తలుపు తడుతుందో తెలియదు. కానీ కొంతమందికి ఇంత చేసినా అదృష్టమనేది వారి దరిచేరదు. ఏం చేసినా నష్టాల పాలు అవుతారు. అదృష్టమనేది నీ చెంత ఉంటే నువ్వు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. అలాంటి  అదృష్టమే ఈ వ్యక్తికి  తాగిలింది. అది ఏంటో తెలుసుకుందామా..? ఒక వ్యక్తి  కూర రుచి చెప్పినందుకు అతనికి నెలకు 50 వేల జీతం ఇస్తున్నారు. మీరు నమ్మడం లేదు కదూ. అవును నేను చెప్పేది నిజమే. మీరు చూస్తున్నది కూడా నిజమే. మరి అదేదో మనకు తెలియని కూర అనుకునేరు. మనం రెగ్యులర్ గా తినే బంగాళదుంప కూర. అలాంటి  ఈ పొటాటో కర్రీని టెస్ట్ చేసిన వ్యక్తికి ఒక నెలకు 50 వేల వేతనాన్ని ఆఫర్ గా ప్రకటించింది బ్రిటన్ దేశంలోని బొటానిస్టు రెస్టారెంట్.

అయితే ఈ ఉద్యోగంలో మీరు ఏదో చేయాలని అనుకునేరు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా  ఆ రెస్టారెంట్ లో వండేటువంటి ఆ పొటాటో లను జస్ట్ రుచి చూస్తే చాలు. వాటిని చాలా ఆనందకరంగా తిని దాని యొక్క రుచిని  చాలా ఆసక్తి కరంగా వర్ణించి  చెప్పాలి. ఇలా చెబితే మీకు ఒక నెలకు 50 వేల రూపాయలు వేతనంగా కూడా ఇస్తారు. మీరు ఈ యొక్క అద్భుతమైన  కర్రీని ఎలా తయారుచేయాలో తెలిసి ఉంటే మీ అందరి కోసం మేము వీకెండ్ జాబును సిద్ధంగా ఉంచామని, మా యొక్క రోస్టును అందరికీ నచ్చే విధంగా చాలా విలువైన రోజుగా తయారు చేసే సత్తా ఉన్నటువంటి వ్యక్తి కోసం మేము వెతుకుతున్నామని  ఆ రెస్టారెంట్ వెబ్సైట్లో తెలిపింది.

 ఇందులో ఎంపికైనటువంటి వ్యక్తి  ఈ నెల 19వ తేదీన ఆదివారం తనకిష్టమైన ఐదుగురు వ్యక్తులతో ఈ యొక్క టేస్టింగ్ శేషనుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ యొక్క రోస్టెడ్ కర్రీని టెస్ట్ చేసిన తర్వాత 500 పదాలతో కూడినటువంటి సమీక్షను కూడా రాయడం సోషల్ మీడియా వేదికపై ప్రచారం చేయడం కొరకు  60 సెకన్ల వీడియో  క్లిప్పులను తయారు చేయాలని రెస్టారెంట్ కోరినది. ఈ రివ్యూలను ఏ సోషల్ మీడియా వేదికపై షేర్ చేస్తారో వారు తెలపాలని చెప్పింది. సెప్టెంబర్ 12వ తేదీ లోగా తమ అభ్యర్థుల దరఖాస్తులను  సమర్పించాలని రెస్టారెంట్ యాజమాన్యం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: