గులాబ్ జాబ్ ఇలా కూడా చేయవచ్చా..?
కావల్సిన పదార్ధాలు :
పాల విరుగుడు లేదా పనీర్ తురుము- 1 కప్పు
పంచదార -ఒక కప్పు
నీరు- ఒక కప్పు
మైదా పిండి -ఒక స్పూను
నెయ్యి -అర చెంచా
నూనె -ఒక కప్పు
ఇలాచి -ఒకటి
తయారు చేయు పద్ధతి :
పాలు విరిగిపోయి ఉంటె వాటితోనే గులాబ్ జాబ్ చేయవచ్చు. అలా కాకపోతే పాలు కాచేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం వేస్తే అవి విరుగుతాయి.అలా విరిగిన పాలని ఒక గుడ్డలోకి తీసుకుని మొత్తం నీరంతా పొయేదాక వడకట్టండి. కేవలం పాల విరుగుడు మాత్రమే ఉండాలి. ఒకవేళ నీరు ఉంటే గులాబ్ జాం ఉండ చుట్టడానికి కుదరదు.ఆ పాలవిరుగుడలో నెయ్యి, మైదా పింది వేసి బాగ ముద్ద లాగ అయ్యెలా చేతితో ఒత్తండి. ఆ తరువాత దానిని పక్కన పెట్టుకుని మూత పెట్టండి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులో పంచదార వేసి, నీరు పోసి బాగ కలిపి లేత పాకం వచ్చెవరకు వుంచండి. పాకం పట్టిన తరువాత అందులో ఇలాచీ వేసి కలిపి పక్కన వుంచండి.ఇప్పుడు పాల విరుగుడు మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలుగా చేయండి. పొయ్యి వెలిగించి బాండీ పెట్టి అందులో నూనె పోసి వేడి అయ్యాక ఈ వుండలని వేసి వేయించండి.మరీ యెక్కువ మంట పెట్టకుండా చిన్న మంటపై వేయించండి. ఇలా అన్ని ఉండలను గొధుమ రంగు వచ్చే వరకు వేయించి పక్కన ఉంచుంకోండి ఇప్పుడు ఎర్రగా వేపుకున్న జామున్లను పాకంలో వేయండి. అంతే గులాబ్ జామ్ రెడీ అయినట్లే.. !