కోడి పకోడీ తిందామా.. !!

Suma Kallamadi
చికెన్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. చాలామంది చికెన్ కూర కంటే చికెన్ ఫ్రై నే బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. అసలే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి సాయంత్రం పూట చికెన్ ఫ్రై చేసుకుని తినండి.చాలా రుచుకరంగా ఉంటుంది. మరి చికెన్ వేపుడుకు కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా. !
కావలిసిన పదార్ధాలు :
350 గ్రాముల కోడి మాంసం
1 కప్ మైదా
1 కప్ బియ్యం పిండి
2 టేబుల్ స్పూన్ జొన్న పిండి
2 కోడి గుడ్లు
 
కారం -కొద్దిగా
ఉప్పు -సరిపడా
2 టీ స్పూన్ ధనియాల పొడి
పసుపు-కొద్దిగా
2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్
కరివేపాకు
1 టీ స్పూన్ జీల కర్ర పొడి
1 టీ స్పూన్ గరం మసాలా పొడి
1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్
 నూనె డీప్ ఫ్రై కి సరిపడా
తయారు చేయు విధానం :
ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్,  కరివేపాకులు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఇంగువ, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత అందులో ముందుగా కోసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి కలపండి.ఇప్పుడు  ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఒక 30 నిమిషాల పాటు ఉంచాలి.  ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి నూనె కాగిన వెంటనే  చికెన్ మిశ్రమాన్ని చేతితో తీసుకుని పకోడీల్లా వేయాలి. ఎరుపు రంగు వచ్చే వరకు వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేపి ఫ్రై ముక్కల్లో వేయాలి. కొత్తి మీరతో గార్నిష్ చేసి నిమ్మ కాయ పిండుకుని ఉల్లి పాయ నంచుకుని తింటే భలే టేస్టీగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: