బెండకాయ ఎగ్ కాంబో అదుర్స్....!

Suma Kallamadi
బెండకాయ ఫ్రై కాకుండా మీరు ఎప్పుడన్నా బెండకాయలతో పులుసు పెట్టి చూసారా. ఆ పులుసులో   కోడి గుడ్లు కూడా వేస్తే కూర ఇంకా బాగుంటుంది.పుల్ల పుల్లగా బెండకాయ ముక్కలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే కూరలో వేసిన కోడి గుడ్లు కూడా పులుసు పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా బెండకాయ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా. ! ముందుగా కావలిసిన పదార్ధాలు ఏంటో చూడండి.
కావలిసిన పదర్ధాలు :
కోడిగుడ్డు-4 ఉడకబెట్టినవి
ఉల్లిపాయలు-1
బెండకాయలు లేతవి  -1/2 kg
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు -సరిపడా
కారం-సరిపడా
పసుపు-సరిపడా
ధనియాల పొడి -1 టీ స్పూన్
చింతపండు పులుసు -కొద్దిగా
కరివేపాకు -కొద్దిగా
ఆవాలు -1 స్పూన్
జీలకర్ర -1 స్పూన్
సాయి మినపప్పు -1 స్పూన్
కొత్తిమీర -కొద్దిగా
 తయారుచేయు విధానం:
 ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కొని రెండు ముక్కలుగా కోసుకోవాలి. ఫ్రై మాదిరిగా చిన్న చిన్న ముక్కలు కోయకూడదు. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కోసుకుని  పక్కన పెట్టుకొండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయండి ఇప్పుడు తాలింపు కోసం ఉంచుకున్న ఆవాలు,  జీలకర్ర,సాయి మినపప్పు,  కరివేపాకు వేసి తాలింపుని బాగా వేపండి. తాలింపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేపాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే దాక వేపాలి. ఒక రెండు నిముషాలు అయ్యాక బెండకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి గరిటెతో తిప్పండి.

ఇప్పుడు ఆ ముక్కలలో కొద్దిగా పసుపు, ఉప్పు,కారం వేసి తిప్పి మూత పెట్టి బెండకాయ ముక్కలను మగ్గనివ్వండి. అవి మెత్తబడిన తరువాత చింతపండు రసం పోయండి. ఆ తరువాత కోడిగుడ్లకు అక్కడక్కడ గాట్లు పెట్టి ఆ పులుసులో వేసేయండి. కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి తిప్పి మూత పెట్టి ఉడకనివ్వండి. బెండకాయ ముక్కలను బాగా తిప్పకండి తిప్పితే ముక్కలుముక్కలుగా అయిపోతాయి. పులుసు చిక్కబడిన తర్వాత ఉప్పు కారం చూసుకుని స్టవ్ ఆఫ్  చేసి కొత్తిమీర జల్లుకొండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: