వంకాయ పచ్చి రొయ్యల కూర ఎలా వండాలంటే.?

Suma Kallamadi
రొయ్యలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే రొయ్యలలో మీరు ఎప్పుడన్నా వంకాయ వేసి వండరా. తినడానికి చాలా బాగుంటుంది. అందుకే ఇండియా హెరాల్డ్ వారు మీకోసం వంకాయ అండ్ రొయ్యల కూర ఎలా వండాలో మీకు వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా వండాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్ధాలు:
పచ్చిరొయ్యలు : అర కేజీ
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
గరం మసాలా పొడి  : టీ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
వంకాయలు : పావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : నాలుగు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : పావు టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
 తయారు చేయు విధానం:
ముందుగా పచ్చి రొయ్యలను ఉప్పు వేసి శుభ్రంగా కడుగుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో పచ్చి రొయ్యలు వేసి వాటిలో కొద్దిగా పసుపు, ఉప్పు కలిపి ఉడక బెట్టుకోవాలి. రొయ్యలలోని నీరు మొత్తం ఇగిరిపోయే దాక ఉడకబెట్టుకోవాలి. రొయ్యలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తరువాత వంకాయలను ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో వేయాలి ఇలా ఉప్పు నీటిలో వేయడం వలన వంకాయలు కండ్ర ఎక్కవు. తరువాత ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ కోసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి ఉల్లిపాయ ,మిర్చి ముక్కల్ని వేసి వేయించాలి. అవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.తరువాత అందులో వంకాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు మగ్గిన తరువాత అందులో ముందుగా వుడికించిన రొయ్యలు వేసి కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. తరువాత ఒక కొద్దిగా నీళ్ళు పోసి పదినిముషాలు పాటు  వుడకనివ్వాలి. కూర ఉడికిన తరువాత  గరంమసాల కూడా వేయాలి. ఒక రెండు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లడమే.అంతే వంకాయ రొయ్యల కూర రెడీ అయినట్లే. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: