పెసల సూప్ ఎప్పుడైనా చేసారా..?

Suma Kallamadi
కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారాన్ని తీసుకుంటున్నారు.అసలు ఇప్పటిదాకా రోగనిరోధక శక్తి గురించి పట్టించుకోని ప్రజలు కరోనా కారణంగా శరీరంలో ఇమ్మ్యూనిటి శక్తిని పెంచే ఆహార పదర్ధాలపై దృష్టి సారిస్తున్నారు.అయితే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది ఒకే ఒక రోజులో లేదా రెండు రోజుల్లో పెరగదు.మెల్లగా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అయితే ఇలా పప్పు ధాన్యాల్లోని పెసల  గింజలతో చేసిన సూప్ తాగడం వలన రోగనిరోధక శక్తి అనేది క్రమంగా పెరుగుతుంది.పప్పు ధాన్యాల్లోని పోషకాలు కరోనా నుండి కోలుకుంటున్న వారికి, కరోనాతో పోరాడుతున్న వారికి, కరోనా రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని చూసేవారికి చాలా ఉపయోగపడతుంది.అలాగే ఈ సూప్ డీహైడ్రేషన్ తో బాధపడేవారికి,  ఫ్లూ తో ఇబ్బందిపడుతుంటే చక్కగా పనిచేస్తుంది.పెసరపప్పు సూప్ తాగడం వలన ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.అధిక ప్రోటిన్ ఉన్నప్పటికీ జీర్ణాశయం మీద ఎలాంటి భారం పడదు.మరి ఆలస్యం చేయకుండా ఈ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దామా. !
 కావాల్సిన పదార్థాలు:
పావు కప్పు- పెసర పప్పు
2కప్పుల - నీళ్ళు
1టేబుల్ స్పూన్- నెయ్యి
1/2టేబుల్ స్పూన్- జీలకర్ర
1/2టేబుల్ స్పూన్ తురిమిన అల్లం
అరకప్పు- క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు
కొద్దిగా -మిరియాలు పొడి
చిటికెడు -అల్లం పొడి
చిటికెడు -వాము
కొద్దిగా -ఉప్పు
కొద్దిగా-మెంతి
తయారుచేసే విధానం :
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పుని తీసుకుని ఒకసారి కడిగి కొద్దిగా నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత అందులోని నీటిని తీసివేయాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యిని తీసుకుని వేడి చేయాలి. దానిలో జీలకర్ర, తురిమిన అల్లం వేసి వేపుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పుని వేసి కొద్దిగా నీళ్లు పోయాలి . అలాగే క్యారెట్, గుమ్మడి ముక్కలని కూడా  అందులో కలుపుకోవాలి.ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ వేడి తగ్గిన.తరువాత మూత తీసి  కొద్దిగా వాము, ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవాలి.కావాలనుకుంటే మెదుపుకోవచ్చు కూడా. లేదంటే అలానే తాగేయవచ్చు.మొత్తం సూప్ రెడీ అయ్యాక  మెంతి పొడిని కొద్దిగా దాని మీద యాడ్ చేయాలి.ఎక్కువ వేస్తే సూప్ చేదుగా ఉంటుంది. అందుకని ఒక చిటికెడు మాత్రమే సూప్ పైన వేసుకోండి. అంతే పెసరపప్పు సూప్ రెడీ అయినట్లే.  వేడి వేడిగా  సేవించండి.


,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: