ఆలూతో ఈ రెసిపీని ట్రై చేసారా.?

Suma Kallamadi
బంగాళాదుంప అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. బంగాళాదుంప చిప్స్ ఎంత ఫేమస్ అయినవో మన అందరికి తెలిసిందే.అలాగే బంగాళాదుంపతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పిల్లలు, పెద్దలు భలే ఇష్టంగా తింటూ ఉంటారు. బంగాళాదుంపతో చాలా రకాల వెరైటీ చిప్స్ మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. బంగాళాదుంపలతో ఫ్రై చేసుకున్న, కూర వండుకున్న గాని చాలా రుచికరంగా ఉంటుంది. మేము చెప్పే ఈ చెట్టినాడు పొటాటో ఫ్రై ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ రెసిపీ. ఇందులో వేసే మసాలా పొడి వలన బంగాళాదుంప ఫ్రై కి మంచి రుచి వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా.
కావాల్సిన పదార్ధాలు:
1/2 kg ఉడికిన్చుకున్న బంగాలదుంప ముక్కలు
1/4 cup నూనె
1/4 spoon పసుపు
1 tsp ఆవాలు
1 tsp జీలకర్ర
1 రెబ్బ కరివేపాకు
మసాలా పొడి కోసం
2 tsps ధనియాలు
1 tbsp సెనగపప్పు
1 tsp మినపప్పు
1 tsp సోంపు
1 inch దాల్చిన చెక్క
5 లవంగాలు
1 అనాస పువ్వు
మరాటి మొగ్గ ()
6 ఎండుమిర్చి
తయారీ విధానం :
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో మసాలా కోసం ఉంచిన సామానంతా వేసి లో-ఫ్లేం మీద ఎర్రగా మంచి సువాసనోచ్చెంత వరకు వేపి కాస్త బరకగా పొడి చేసుకోండి. తరువాత అందులో మరి కొద్ది నూనె పోసి నూనె వేడి అయ్యాక  అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు, పసుపు వేసి వేపుకోవాలి.అవి వేగాక ఉడికించి ముక్కలుగా చేసుకున్న బంగాళా దుంపల ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద క్రిస్పీగా వేపుకోండి.
బంగాలదుంపలను మీడియం ఫ్లేం మీద మూత పెట్టకుండా వేపుకోవాలి. ఇలా బంగాళాదుంపలు ఎర్రగా వేగడానికి కనీసం 20 నిమిషాలు పైన సమయం పడుతుంది. దుంప ముక్కలని 80 % మాత్రమే మూత పెట్టకుండా ఉడికించండి. మరీ మెత్తగా ఉడికిస్తే నూనెలో వేగేప్పుడు ముక్కలు చితికిపోతాయి. బంగాళాదుంప ముక్కలు ఎర్రగా వేగాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి కలుపుకుని ౩-4 నిమిషాలు వేపుకుని దిమ్పెసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: