టేస్టీ.. టేస్టీ.. బిస్మిల్లాబాత్ ఇంట్లోనే ఇలా ట్రై చేయండి..!

Suma Kallamadi
బిస్మిల్లా బాత్ ఈ వంట గురించి మన తెలుగు రాష్ట్రాలలో ఎవరికీ ఎక్కువగా తెలియదు. ఈ వంటకాన్ని కర్ణాటక రాష్ట్రంలో చాలా ఇష్టంగా తింటారు. ఆ రాష్ట్రం బిస్మిల్లా బాత్ వంటకు చాలా ప్రసిద్ధి. అయితే మీరు కూడా ఈ వంటను ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నారా.. ఇంకా ఎందుకు ఆలస్యం ఈ రెసిపీ మీకోసమే.
బిస్మిల్లా బాత్  కు కావాల్సిన పదార్దాలు:
కందిపప్పు - అరకప్పు, క్యారెట్‌ - ఒకటి, బీన్స్‌ - ఐదు, బఠానీలు - పావు కప్పు, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - ఒకటి, బంగాళదుంప - ఒకటి, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌, చింతపండు - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత, ఎండు మిర్చి - నాలుగు, మిరియాలు - కొద్దిగా, మెంతులు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నువ్వులు - ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె - ఒక టీస్పూన్‌, కరివేపాకు - ఒక కట్ట, ఆవాలు - ఒక టీస్పూన్‌, బియ్యం - ఒకకప్పు.
బిస్మిల్లా బాత్  తాయారు చేసే విధానం:
ముందుగా బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి పావుగంటపాటు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్‌లో వేసి ఉడికించాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్న తరువాత జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు వేయాలి. రెండు నిమిషాల తరువాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక మూడు నిమిషాల తరవాత బంగాళదుంప, క్యారెట్‌ ముక్కలు, బీన్స్‌, బఠానీ, టొమాటో ముక్కలు వేసి కలియబెట్టాలి. ఇక ఇప్పుడు చింతపండు గుజ్జు వేయాలి. తగినంత ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, అన్నం మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై కాసేపు ఉంచుకుని, నెయ్యి వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొంటే బిస్మిల్లా బాత్  రెడీ. టికెడు పసుపు వేసి వేడివేడిగా భుజించితే చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: