నోరూరించే మామిడికాయ పులిహోర తయారీ విధానం మీకోసం.. !!
కావలిసిన పదార్ధాలు
అన్నం -సరిపడా
మామిడికాయ పెద్దది -1
పచ్చి మిర్చి-3
పసుపు -1 స్పూన్
1/2 కప్ ముడి వేరుసెనగలు
కొత్తిమీర -కొద్దిగా
1 కప్ తురిమిన టెంకాయ
ఆవాలు -అర స్పూన్
జీలకర్ర -అర స్పూన్
పచ్చిశెనగపప్పు -కొంచెం
సాయి మినపప్పు -కొద్దిగా
ఉప్పు -కొద్దిగా
1/2 కప్ - ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
కరివేపాకు-కొద్దిగా
ఇంగువ -కొంచెం
తయారీ విధానం :
ముందుగా మామిడికాయను కోసి తొక్కు తీసేసి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అన్నం కూడా పలుకుగా వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో పచ్చి మిర్చి, ఇంగువ, పసుపు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి.తరువాత స్టవ్ మెడ బాణి పెట్టి కొద్దిగా నూనెను వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, పచ్చి శెనగపప్పు, జీలకర్ర,కరివేపాకు, వేరుశనగ పప్పును వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించాలి.ఇందులో మిక్సీ జార్‌లో వేసుకున్న పేస్ట్ వేసి వేపాలి. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించిన అన్నం, తురిమిన పచ్చి మామిడి గుజ్జుని కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో తురిమిన కొబ్బరి,సరిపడా ఉప్పు వేసి అన్ని పదార్థాలను బాగా వేయించండి. తరువాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. రైస్ తయారైన తర్వాత గ్యాస్ స్విచ్ ఆఫ్ చేయండి.అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహార రెడీ అయినట్లే..