మీకు రోజంతా ఎనర్జీని ఇచ్చే టిఫిన్స్ గురించి తెలుసుకోండి.. !!

Suma Kallamadi

ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ ను టిఫిన్ కింద తినడం మంచిది కాదు. అలాగే ఉదయం పూట బాగా హెవీ ఫుడ్ తీసుకోవడం కూడా మంచి పద్ధతి కాదు.అందుకనే తేలికపాటి ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ కింద తీసుకోవడం వలన త్వరగా జీర్ణం అవుతుంది అలాగే రోజంతా కూడా చాలా యాక్టివ్‌గా ఉండటంతోపాటు శరీరానికి శక్తి చేకూరుతుంది.అలాగే బరువు కూడా మన నియంత్రణలో ఉంటుంది. అలాగే ప్రతి రోజు చేసే టిఫిన్ తిని తిని బోర్ కొట్టిందా అయితే ఈసారి వెరైటీగా ఈ టిఫిన్స్ రుచి చూడండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.అది ఏంటంటే ఉదయం పూట కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి రోజంతా మనం పని చేయడానికి శరీరానికి కొంత శక్తి కావాలి. అందుకనే ఉదయం పూట శరీరానికి  శక్తిని పెంచే అల్పాహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోజంతా హుషారుగా ఉండేందుకు పోషకాలు నిండుగా కలిగిన ఈ  5 రకాల టిఫిన్స్ గురించి ఈరోజు మీరు తెలుసుకోవాలిసిందే.. ప్రతిరోజు ఈ టిఫిన్స్ ను మీరు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
1)పోహా : మీ అందరికి పోహా గురించి తెలిసే ఉంటుంది. ఈ వంటకం  మహారాష్ట్రలో బాగా ఫేమస్ వంటకం.దీనిని ఉదయం పూట టిఫిన్ కింద తింటే ఆరోగ్యానికి మంచిది. పోహాను (అటుకులు)వేరుశెనగ పప్పులతో కలిపి, కొంచెం నూనె వేసుకుని తయారు చేసుకోవాలి. లేదా ఇందులో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పచ్చి బఠానీలు, టొమోటోలు  కూడా వేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు.

2)రవ్వ ఉప్మా : రవ్వ ఉప్మా మన అందరికి బాగా తెలిసిన వంటకం. దీనిని ఎక్కువగా దక్షిణ భారత ప్రజలు తింటూ ఉంటారు. నూనె వేసి అందులో పచ్చి మిరపకాయలు, కరివేపాకు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, అవాలు, జీలకర్ర, శనగ పప్పు వేసి వేయించి తర్వాత సరిపడా నీళ్లు పోసి, రవ్వ,ఉప్పు వేసి కలిపి, చివరలో నెయ్యి వేసుకుని తయారు చేసుకోవచ్చు. తేలికగా అయిపోయే వంటకాల్లో ఉప్మా కూడా ఒకటి. అలాగే తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతుంది కూడా. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు శక్తిని పెంచుతుంది.
3)ధోక్లా :  ఈ టిఫిన్ ను గుజరాతీలకు బాగా ఇష్టంగా తింటారు.దీనిని వోట్స్, మొక్కజొన్నతో తయారు చేస్తారు. శరీరం బాగా అలసటకు గురి అయినప్పుడు తప్పనిసరిగా ధోక్లా తీసుకోవాలి. దీంతో శరీరానికి తొందరగా శక్తి చేకూరుతుంది.
 
4)ఊతప్పం : ఊతప్ప దక్షిణ భారతదేశంలోనే అత్యంత పేరుగాంచిన  వంటకం. ఈ వంటకాన్ని మినప పప్పు, బియ్యం పొట్టుతో తయారు చేస్తారు. ఊతప్ప కొంచెం మందంగా ఉంటుంది. అయితే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు,కొత్తిమీర, జీలకర్ర,అల్లం ముక్కలు,  కూరగాయలు వేసుకుని తినొచ్చు. ఇది తినడానికి ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు దీని వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.. !!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: