
రెస్టారెంట్ స్టైల్ లో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చుడండి.. !!
కావలసిన పదార్దాలు :
1)చేప ముక్కలు – 1/2 కేజీ
2)ఉప్పు – రుచికి సరిపడా
3)కారం – 1/2 స్పూన్
4)పసుపు – పావు1/4 టీస్పూన్
5)బియ్యప్పిండి – 1 టీ స్పూన్
6)కార్న్ ఫ్లోర్ – 1 టీ స్పూన్
7)అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్
8)జీలకర్రపొడి- 1/4 టీస్పూన్
9)నిమ్మరసం – 2 టీ స్పూన్స్
10)నూనె – తగినంత
11)పచ్చిమిర్చి – 1
12)కరివేపాకు – 2 రెమ్మలు
13)ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు తరిగినవి
14)ధనియాల పొడి – 1/4 టీస్పూన్
తయారుచేయు విధానం :
ముందుగా చేపముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని గళ్ళు ఉప్పు వేసి బాగా శుభ్రంగా మంచినీటితో కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలోకి బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ రెండిటిని తీసుకోని అందులో కారం, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా కలిపినా పిండిలో చేప ముక్కలను వేసి మసాలా పట్టించి గంటపాటు నానా పెట్టుకోవాలి.ఇలా గంటపాటు నానాపెట్టడం వల్ల చేప ముక్కలకు ఉప్పు కారం, మసాలా బాగా పడతాయి. గంట అయ్యాక ఒక పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడ నూనె పోసి కాగాక మసాల పట్టించిన చేప ముక్కలను ఒక్కోటిగా వేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి కాస్త వేడి అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగించాలి. తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, నిమ్మరసం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి కలపాలి. మరికాసేపు వేయించుకొన్న తరువాత నిమ్మరసం పిండుకుని స్టవ్ పైనుంచి దింపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి అంతే. ఎంతో రుచికరంగా ఉండే ఫిష్ ఫ్రై కర్రీ రెడీ..