ఫ్రైడ్ మటన్ కట్ లెట్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి.....

Purushottham Vinay
మటన్ ఖీమా ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మటన్ ఖీమాతో ఎన్నో రుచికరమైన ఐటమ్స్ చేసుకోవచ్చు. ఎన్నో రుచికరమైన డిష్ లు వండుకోవచ్చు. ఇక మటన్ ఖీమాతో రుచికరమైన ఫ్రైడ్ మటన్ కట్లేట్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....
ఫ్రైడ్ మటన్ కట్లేట్ తయారు చెయ్యడానికి కావల్సిన పదార్థాలు.....
మటన్ ఖీమా- 750 grams
ఉల్లిపాయలు- 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి) వెల్లుల్లి రెబ్బలు- 5 (కచపచదంచి పెట్టుకోవాలి) పచ్చిమిర్చి- 4 (వీటిని కూడా కచపచ దంచి పెట్టుకోవాలి)
గరం మసాల- 1tsp
కారం- 1tsp
చాట్ మసాల- 1tsp
కొత్తిమీర- కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి) నెయ్యి- 1tbsp
శెనగపిండి - 2tbsp
నూనె- 1 cup(డీప్ ఫ్రై చేయడానికి )
ఉప్పు- రుచికి సరిపడా....

ఫ్రైడ్ మటన్ కట్లేట్ తయారు చేసే విధానం...
ముందుగా మటన్ ఖీమాను బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. నీరు మొత్తం వంపేసుకోవాలి.ఇప్పుడు పైన లిస్ట్ లో తీసుకొన్న పదార్థాలన్నింటిని (నూనె లేదా నెయ్యి తప్ప)ఖీమాలో వేసి బాగా మిక్స్ చేయాలి.తర్వాత అందులో గోరువెచ్చని నీటిని పోసి మొత్తం మిశ్రమాన్ని ముద్దలా కలుపుకోవాలి.ఇలా కలిపి పెట్టుకొన్న మిశ్రమాన్ని 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.నూనె కాగిన తర్వాత మటన్ ఖీమాలో కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని కట్ లెట్ లా ఒక షేప్ లో వడలాగా తట్టుకోవాలి.ఇలా తయారుచేసుకొన్న వాటిని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.వేడి వేడీ ఖీమా కట్ లెట్ కు ఉల్లిపాయ ముక్కలు జోడించి వేడి వేడిగా సర్వ్ చేయండి. టేస్టీ అండ్ హెల్తీ ఈవెనింగ్ స్నాక్ ను ఎంజాయ్ చేయండి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: