రుచికరమైన బెంగాలి మటన్ కర్రీ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
మటన్ అంతే నాన్వెజ్ ప్రియులకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఎంతో రుచికరంగా వుంటుంది. అలాగే ఇందులో మనిషి బలంగా ఉండటానికి కావాల్సిన ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఇక బెంగాలి స్టైల్ లో మటన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇక ఈ రుచికరమైన బెంగాలి మటన్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి. మీరు ఇంట్లో ట్రై చెయ్యండి....

కావల్సిన పదార్థాలు:
మటన్- 1kg (మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు- 4
అల్లం-వెల్లుల్లి పేస్ట్- 1tbsp
పెరుగు- 1 cup
టమోటో- 1
జీలకర్ర పొడి- 1tbsp
ధనియాలపొడి- 1tbsp
కాశ్మీరి రెడ్ చిల్లీ పౌడర్- 1tsp
పసుపు- 1tsp
గరం మసాలా పొడి- 1tsp
బిర్యానీ ఆకు- 2
దాల్చిన చెక్క- 1
యాలకలు- 3
లవంగాలు- 5
పంచదార- 1tsp
ఉప్పు - రుచికి పరిపడా
ఆవనూనె- 2tbsp
కొత్తిమీర- 2tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.తర్వాత మటన్ కు కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మరియు ఒక చెంచా ఆవాలు వేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేసి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.అంతలోపు ఉల్లిపాయలు మరియు టమోటోలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.రెండు గంటల తర్వాత ఆవనూనెను వేడి చేసి అందులో దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ, టమోటో పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకూ 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మరియు ధనియాలపొడి వేసి 5 నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి . 5నిముషాలు పూర్తిగా మిక్స్ చేస్తూ పెట్టుకోవాలి.మంటను పూర్తిగా తగ్గించి తర్వాత పాన్ కు మూత పెట్టాలి.45 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.మటన్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేయాలి.మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ నోరూరించే వంటను పులావ్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: