రుచికరమైన బ్రెడ్ రోల్స్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
చాలా మంది సాయంత్రం వేళల్లో చిరు తిండులు తింటుంటారు. పునుగులు, బజ్జిలు లేదంటే చిప్స్ అవి తింటుంటారు. అవి మాములుగా తినటానికి బాగున్నా కాని వాటివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.పైగా అవి ఆయిల్ ఫుడ్ కాబట్టి అవి తింటే బరువు పెరుగుతారు కాని ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి వాటికి బదులుగా చిన్న పిల్లలకి గాని పెద్ద వాళ్లకి గాని బ్రెడ్ రోల్స్ అలవాటు చెయ్యడం మంచిది. పైగా ఈ బ్రెడ్ రోల్స్ తినటానికి కూడా చాలా బాగుంటాయి.ఇక రుచికరమైన ఈ బ్రెడ్ రోల్స్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

బ్రెడ్‌ రోల్స్‌ తయారు చెయ్యడానికి
కావలసిన పదార్ధాలు....

బ్రెడ్‌ స్లైస్‌ – 10(అంచులు తొలగించి పెట్టుకోవాలి),
క్యారెట్‌ తురుము – 1 కప్పు,
పనీర్‌ తురుము – పావు కప్పు,
ఉల్లిపాయ – 1(సన్నగా తరగాలి),
పచ్చి మిర్చి – 2(చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),
మిరియాల పొడి – పావు టీ స్పూన్,
వెన్న – 1 టీ స్పూన్‌,
కారం – అర టీ స్పూన్,
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా...

బ్రెడ్ రోల్స్ తయారు చేయు విధానం.....
ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. కళాయిలో వెన్న వేసుకుని, కరిగిన వెంటనే అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం పనీర్‌ తురుమును కూడా వేసి వేయించుకోవాలి.  ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలుపుకుని, ఒక నిమిషం పాటు వేగాక స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌లో వేసుకుని రోల్‌లా చుట్టుకోవాలి. రోల్‌ విడిపోకుండా ఉండేందుకు బ్రెడ్‌ అంచుల్ని కాస్త తడిచేసి లోపలికి నొక్కేయాలి. అన్ని బ్రెడ్‌ ముక్కల్ని ఇలాగే చేసి పెట్టుకుని.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.ఇక రుచికరమైన ఈ బ్రెడ్ రోల్స్ ని మీరు ట్రై చెయ్యండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: