రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం ఎలా చెయ్యాలో తెలుసుకోండి......

Purushottham Vinay
స్వీట్ కార్న్ ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది సాయంత్రం వేళ మంచి స్నాక్ గా  తినటానికి చాలా బాగుంటుంది. దీంతో మనం రుచికరమైన పాయసం చేసుకోని తినవచ్చు. ఇక రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం ఎలా తయారు చెయ్యాలో ఈరోజు తెలుసుకోండి. మీరు ట్రై చెయ్యండి. ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు....
స్వీట్ కార్న్ పాయసానికి కావలసిన పదార్ధాలు...
స్వీట్‌ కార్న్‌ - 2 కప్పు(మెత్తగా ఉడికించుకోవాలి),
చిక్కటి పాలు - 4 కప్పులు,
నెయ్యి - పావు కప్పు,
 పంచదార - అర కప్పు,
ఏలకుల పొడి - 1 టీ స్పూన్‌,
పిస్తా,
కిస్‌ మిస్,
జీడిపప్పు,
బాదం పప్పు - 2 టేబుల్‌ స్పూన్‌ చొప్పున(నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి), కుంకుమ పువ్వు - చిటికెడు
స్వీట్ కార్న్ పాయసం తయారు చేసే విధానం....
ముందుగా ఉడికిన కార్న్‌లో 2 టేబుల్‌ స్పూన్లు తీసి పక్కనపెట్టి.. మిగిలిన కార్న్‌ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్‌ తీసుకుని అందులో కార్న్‌ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్‌ ఆన్‌ చేసి, కళాయిలో 4 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి అందులో కార్న్‌ - పాల మిశ్రమాన్ని వేసి చిన్నమంటపై ఉడికించుకోవాలి. అందులో కుంకుమ పువ్వు కలుపుకోవాలి. మిగిలిన పాలు పోసి గరిటెతో తిప్పుతూ.. అడుగంటకుండా చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి. దించే ముందు బాదం, జీడిపప్పు, కిస్‌ మిస్, పిస్తా ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది స్వీట్‌ కార్న్‌ పాయసం.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం మీరు ఇంట్లో ట్రై చెయ్యండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: