ఎగ్ బన్స్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఎగ్ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికి తెలుసు. ఎగ్ తో మనం ఎన్నో రకాల వెరైటీలు చేసుకోవచ్చు. ఇక రుచికరమైన ఇంకా ఆరోగ్యవంతమైన ఎగ్ బన్స్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.దీంట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి.ఇది చిన్న పిల్లలు తింటే చాలా పుష్టిగా బలంగా ఉంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచే వారికి అలవాటు చెయ్యండి. ఇదో మంచి పౌష్టిక ఆహారం.. మీరు తక్కువ టైంలోనే  ఇంట్లోనే  ఈ రుచికరమైన ఎగ్ బన్స్ ని తయారు చేసుకోని తినొచ్చు ...

ఎగ్ బన్స్  తయారీకి కావాల్సిన పదార్ధాలు...

గుడ్లు   – 6
బన్స్ – 6, ఉల్లిపాయలు – 3
పచ్చిమిర్చి – 2
చీజ్‌ తురుము – 2 టీ స్పూన్లు
కొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌
కారం – 1 టీ స్పూన్‌
మిరియాల పొడి – 1 లేదా 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత

ఎగ్ బన్స్ తయారు చేయు విధానం తెలుసుకోండి...

ముందుగా బన్స్‌ పైభాగం తొలగించి గుంతల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్‌ తురుము, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి మరిన్ని జోడించుకోవచ్చు. ఆ మొత్తం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బన్స్‌ బౌల్స్‌లో వేసుకుని.. ప్రతి బన్‌లో ఒక కోడిగుడ్డు కొట్టి.. ఓవెన్‌లో ఉడికించుకుంటే భలే రుచిగా ఉంటాయి.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన ఎగ్ బన్స్ మీరు తయారు చేసుకోండి.. ఆ రుచిని ఆస్వాదిస్తూ ఆనందంగా తినండి. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: