పాలకూర వెల్లుల్లి రైస్ తయారు చేయు విధానం.....
పాలకూర వెల్లుల్లి రైస్ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...
పాలకూర తరుగు - నాలుగు కప్పులు,
వండిన అన్నం - రెండు కప్పులు,
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు,
టమోటో ప్యూరీ - అరకప్పు,
జీలకర్ర - ఒక టీస్పూను,
వెల్లుల్లి రెబ్బలు - పదిహేను,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - రెండు టేబుల్ స్పూనులు,
అల్లం తరుగు - అరటీస్పూను,
పచ్చి మిర్చి - మూడు
పాలకూర వెల్లుల్లి రైస్ తయారు చేయు విధానం....
ముందుగా పాలకూరని బాగా కడిగి మిక్సీలో పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, వేసి వేయించాలి. తరువాత టొమాటో తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అందులో పాలకూర పేస్టుని కూడా వేసి బాగా వేయించాలి. కాస్త ఉప్పు కూడా చేర్చాలి. పచ్చి వాసన పోయేలా పాలకూరనా బాగా వేయిస్తే రైస్ టేస్టీగా వస్తుంది. బాగా వేయించాక అందులో వండని అన్నాన్ని వేసి కలపాలి. పాలకూర - వెల్లుల్లి రైస్ మీరు తినేందుకు రెడీ అయిపోయినట్లే. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...