రుచికరమైన మిల్క్ కేక్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి.....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సాధారణంగా మనం కేక్స్ ని ఎంతగానో ఇష్టపడతాం. కేక్స్ ని అనేక రకాల ఫ్లేవర్స్ తో మనం తయారు చేసుకుంటాం. అలాగే మిల్క్ తో తయారు చేసుకునే కేక్ ఎంతో రుచికరంగానో కాదు ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి ఈ రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన కేక్ ని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...
మిల్క్ కేక్ కి కావాల్సిన పదార్ధాలు..
పాలు - అరలీటరు, పంచదార - పావు కప్పు, నిమ్మరసం - ఒక స్పూను, పిస్తా, బాదం పలుకులు - గుప్పెడు
మిల్క్ కేక్ తయారు చేయు విధానం....
ముందుగా  మందంగా ఉండే పాత్రలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. చిన్న మంట మీద మరిగించాలి. నిమ్మరసాన్ని పిండి నీళ్లలో కలిపి ఉంచాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక్కో చుక్కని అదులో కలుపుతూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ పోస్తే పాలు విరిగిపోతాయి. కనుక పాలు విరిగిపోకుండా ఒక్కో చుక్క వేస్తూ కలుపుతూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు ఇలా చేయాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార కలపాలి. తరువాత కూడా కోవాలా అయ్యే వరకు మరిగించాలి. కోవాలా దగ్గరకు చేరాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఒక ప్లేటు అడుగుకు నెయ్యి రాసి బాదం పిస్తా ముక్కలు చల్లాలి. దానిపై కోవా మిశ్రమాన్ని వేయాలి. ఒక ఆకారంలో ఆ మిశ్రమాన్ని సర్ది చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇక ఇలాంటి  మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని  ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి.....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: