గుమ్మడికాయ ఐస్ క్రీమ్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... గుమ్మడికాయ ఐస్ క్రీం ఎప్పుడైనా తిన్నారా. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.ఇక ఈ గుమ్మడికాయ ఐస్ క్రీమ్ ని ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

కావాల్సిన పదార్ధాలు....
గుమ్మడికాయ గుజ్జు - రెండు టీ స్పూనులు, అరటి పండు - ఒకటి, మాపిల్ ఎక్స్ ట్రాక్ట్ - పావు టీ స్పూను (సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి), వెనీలా ఎక్స్ ట్రాక్ట్ - పావు టీస్పూను, చాక్లెట్ చిప్స్ - గుప్పెడు, తేనె - అర టీస్పూను, చక్కెర - అర టీస్పూను
గుమ్మడికాయ ఐస్ క్రీం  తయారు చేసే విధానం...

ముందుగా అరటి పండును గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్లో గుమ్మడికాయ గుజ్జు, అరటి పండు గుజ్జు, మాపిల్ ఎక్స్ ట్రాక్ట్, వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్, తేనె, చక్కెర వేసి బాగా బ్లెండ్ చేయాలి. చాక్లెట్ చిప్స్ మాత్రం వేయద్దు. మిశ్రమం క్రీమ్ లా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. తరువాత దానికి ఒక గిన్నెలోకి తీసుకుని పైన చాక్లెట్ చిప్స్ చల్లి... డీఫ్రిజ్ లో పెట్టాలి. ఒక గంటపాటూ పెట్టాక బయటికి తీస్తే యమ్మీగా గుమ్మడి ఐస్ క్రీమ్ సిద్ధమైపోతుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రెసిపీస్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: