రుచికరమైన చనా మసాలా ని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చనా మసాలా ఎంతో రుచికరమైన వంటకం. ఇది నార్త్ ఇండియా లో ఎంతో ఫేమస్ అయిన వంటకం. ముఖ్యంగా పంజాబ్ లో ఈ వంటకం బాగా తింటారు. ఇక రుచికరమైన ఈ చనా మసాలా ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

కావాల్సిన పదార్థాలు...కాబూలీ శెనగలు - రెండున్నర కప్పు, టమాట ముక్కలు - మూడు కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లం తరుగు - అర స్పూను, వెల్లుల్లి తరుగు - రెండు టీస్పూనులు, పసుపు - ఒక టీస్పూను, కొత్తిమీర పొడి - రెండు టీస్పూనులు, జీలకర్ర పొడి - రెండు టీస్పూనులు, కారం - ఒక టీస్పూను, గరం మసాలా - ఒక టీస్పూను, ఉల్లిపాయ - రెండు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడినంత....
చనా మసాలా తయారు చేయు విధానం...
కాబూలీ శెనగల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన నీళ్లు వంపేసి పక్కన పెట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. అవి బాగా వేగాక టమోటా ముక్కల్ని, కొత్తిమీర పొడి, పసుపు, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలపాలి. వీటిని బాగా ఉడికించాలి. బాగా వేగితే ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ముందుగా నానబెట్టిన కాబూలీ శెనగల్ని వేసి కలపాలి. రెండున్నర కప్పులు నీళ్లు కూడా వేయాలి.
ఉప్పు వేసి, కాస్త కొత్తిమీర ఆకులు చల్లి మూత పెట్టేయాలి. ఓ పావుగంట సేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.పావుగంట ఉడికాక అందులో గరం మసాలా వేసి బాగా కలపాలి. మళ్లీ మూత పెట్టేసి చిన్న మంట మీద మూడు నిమిషాల పాటూ ఉడకనివ్వాలి. మూత తీసి ఒకసారి బాగా కలపాలి. శెనగలు ఉడికాయో లేదో చూసుకోవాలి. ఉడకకపోతే మరికాసేపు చిన్నమంట మీద ఉడికించాలి.ఇక ఈ చనా మసాలా ఇంకా రుచికరంగా వుండటానికి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: