పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక పైనాపిల్ తినటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారు. పైనాపిల్ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఆ రుచికరమైన పైనాపిల్ పచ్చడిని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...
కావాల్సిన పదార్ధాలు...
- 2 టీ స్పూన్ సెనగ పప్పు
- 2 టీ స్పూన్ మినపప్పు
- 1/4 టీ స్పూన్ మెంతులు
- 1 చిటికెడు పసుపు
- 5 చేతి నిండా కరివేపాకు
- 1/4 కప్ తురిమిన
- 1/4 కప్ తాజాగా రుబ్బినవి కొబ్బరి పొడి
- 5 గ్రాములు చింత పండు
- 2 టీ స్పూన్ బెల్లం పొడి
- 8 ఎండు మిరపకాయలు
- 1 టీ స్పూన్ ఆవాల విత్తనాలు
- 1 టీ స్పూన్ రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
- అవసరాన్ని బట్టి ఉప్పు
- పైనాపిల్ పచ్చడి తయారు చేయు విధానం..
ముందు గాఓ గిన్నెలో నీరు తీసుకుని అందులో పైనాపిల్ ముక్కలు వేసి 15 నిషాల పాటు ఉడికించండి.ఇప్పుడు మరో గిన్నెలో శనగపప్పు, మినపప్పు, మెంతులు వేసి దోరగా వేయించాలి. అందులోనే ఎండుమిర్చి వేసి మరికాసేపు వేయించాలి.ఇలా వేయించిన పప్పులను మిక్సీ జార్‌లో వేసి అందులోనే కొబ్బరిపొడి, కొబ్బరి తురుము, నానబెట్టిన చింతపండుని కూడా వేసి మెత్తని పేస్ట్‌లా చేయాలి.ఇప్పుడు మరో పాన్‌లో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.ఇందులోనే పైనాపిల్ మిశ్రమాన్ని వేయాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా నీరు వేసి ఉడికించండి..ఇలా తయారైన పైనాపిల్ పచ్చడిని చపాతీ, అన్నంలో తింటే చాలా బాగుంటుంది.ఇలాంటి మరెన్నో వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...