రుచికరమైన కుట్టుకా దోశ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

frame రుచికరమైన కుట్టుకా దోశ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మన దక్షిణ భారతీయ వంటకాలలో దోశ  చాలా  రుచికరమైన వంటకం. దోశ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.దీన్ని  అల్పాహారంగా ఇంకా  భోజనం బదులు కూడా తీసుకోవచ్చు. సాధారణంగా దోశను మినపపిండి, బియ్యం పిండితో తయారు చేస్తారు. ఉపవాస వ్రతంలో తినే పిండి మరియు పదార్ధాల కలయికను ఉపయోగించి దోశ  పిండిని తయారు చేయొచ్చు. కుట్టు కా దోశ  ఈ రెసిపీలో, లోపల పెట్టడం కోసం బంగాళాదుంప, రాక్ సాల్ట్‌తో తయారు చేస్తారు. ఈ పిండిలో అర్బి, బుక్వీట్ పిండి, ఎర్ర కారం, పచ్చిమిర్చి ఇంకా ఉప్పు ఉండటం వల్ల మెత్తగా ఉంటుంది. పిండి ఉడికించి, లోపల వేయించిన బంగాళాదుంపతో చేసిన కూరను పెట్టి పాన్ మీద కాలుస్తారు.


కుట్టు కా దోశ  తయారు చెయ్యటానికి కావలిసిన పదార్థాలు.......

ముందుగా బంగాల దుంప  ఫిల్లింగ్ కోసం.....
ఉడకబెట్టిన మూడు బంగాళాదుంపలు....
నెయ్యి వేయించడానికి సరిపడా...
ఉప్పు రుచికి సరిపడా....
అర టీస్పూన్ కారం.....
అర టీస్పూన్ తరిగిన అల్లం....
5 టేబుల్ స్పూన్ల బుక్వీట్ పిండి కుట్టు....
2 టేబుల్ స్పూన్ల ఉడకబెట్టిన అర్బి...
ఉప్పు రుచికి సరిపడా....
అర టీస్పూన్ అజ్వైన్....
అర టీస్పూన్ కారం....
1 స్పూన్ తరిగిన అల్లం....
1 స్పూన్ తరిగిన పచ్చిమిర్చి....
కాచిన నెయ్యి కొంచెం....


రుచికరమైన కుట్టు కా దోశ తయారు చేసే విధానం...

బాణలిలో నెయ్యి వేడి చేసి, బంగాళాదుంపలను చూర్ణం చేసి మిగిలిన పదార్థాలలో కలపాలి.
బంగాళదుంప మిశ్రమాన్ని లేత గోధుమ రంగు వచ్చేవరకు కొన్ని నిమిషాలు వేపాలి.
వేపిన బంగాళాదుంప మిశ్రమాన్ని బయటకు తీసి పక్కన ఉంచండి.

ఒక గిన్నెలో, అర్బీని మాష్ చేసి పిండి మరియు ఉప్పుతో కలపండి.కొంచెం నీరు వేసి బాగా కలపాలి.
అజ్వైన్, కారం, అల్లం, పచ్చిమిర్చి వేసి మళ్లీ కలపాలి.
పిండి మృదువుగా జాలువారే వరకు నీటిని జోడించి, కలపండి.ఒక ఫ్లాట్ పాన్ వేడి చేసి, దానిపై కొంచెం నెయ్యి వేసి, దోస వెయ్యండి.కొన్ని నిమిషాలు ఉడికించనివండి, అంచులు క్రిస్పీగా రావాలంటే చుట్టూ ఎక్కువ నెయ్యి వెయ్యండి.ఇప్పుడు దోసను తిప్పండి మరియు మరొక వైపు ఉడికించాలి.ఇప్పుడు పైన కొంత పొటాటో ఫిల్లింగ్ కొంచెం వేసి ఉంచండి. తరువాత దోసను మడవండి.పుదీనా మరియు కొబ్బరి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది.ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: