నోరూరించే బాదుషాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మనం భారతీయ వంతకాల్లో స్వీట్స్ కి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికి తెలిసిందే... ఇక రుచికరమైన ఆ స్వీట్లలలో బాదుషా ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాదుషా అనగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఎక్కువగా బయట కొనుక్కుని తింటుంటారు. అలా కాకుండా ఈ బాదుషాలని మీరే తయారు చేసుకుని హ్యాపీగా తినేయండి.. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...


నోరూరించే బాదుషాలు తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు....


ప్రధాన పదార్థం కోసం ....

2 కప్ మైదా....

2 కప్ చక్కర....

ప్రధాన వంటకం కోసం ....

1/4 కప్ నెయ్యి....

1/4 కప్ నీళ్ళు....

అవసరాన్ని బట్టి సోడా.....

4 పొడిగా చేసిన యాలకులు.....

1 రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె....

ఇక చివరగా పోపు కోసం....

1 చేతి నిండా ముక్కలుగాా కోసిన బాదం......


రుచికరమైన బాదూషాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

రుచికరమైన కరమైన బాదుషాలు కోసం ముందుగా ఓ బౌల్‌లో పావుకప్పు నీటిని తీసుకోవాలి. అందులో కరిగించిన నెయ్యి, సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో మైదా వేసి కలపండి. తర్వాత అందులో పెరుగు వేసి కలిపి పక్కనపెట్టండి..ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో ఒక కప్పు పంచదార, అరకప్పు నీరు వేసి పాకం పట్టాలి.మైదా మిశ్రమాన్ని తీసుకుని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా కట్ చేసి వాటిని బాదుషా ఆకృతిలో చేయాలి..

ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. వేడి అయ్యాక తయారైన బాదుషాలని వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించండి. వేయించిన బాదుషాలను ఇప్పుడు పంచదార పాకంలో వేయండి. అరగంట తర్వాత ఈ బాదుషాల రుచిని మీరు ఆస్వాదించండి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: