డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారు చేయు విధానం...

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి.... కొన్ని డ్రింక్స్  ఉంటాయి చూడండి . తాగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులో చాలా కొన్ని ట్రెడిషనల్ డ్రింక్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశ  ప్రదేశాల్లో చేసే ఈ డ్రింక్స్  ఎంతో హెల్దీగా ఉండడమే కాకుండా.. అంతే టేస్టీగా ఉంటాయి. అలాంటి డ్రింక్స్  గురించి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ లో  ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ పేరే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ .. చెప్పాలంటే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా రుచికరమైన మిల్క్ షేక్..



ముందుగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్  తయారీకి  కి కావాల్సిన పదార్ధాలు.....
1...1 టీ స్పూన్ సోపు
2....3 టేబుల్ స్పూన్ ఎండిన రోజా రేకులు
3...1/2 లీటర్ చల్లని పాలు
4...1 టీ స్పూన్ గుమ్మడి గింజలు
5...4 యాలకులు
6...1 టీ స్పూన్ గసగసాలు
7...1 కప్ చక్కర
8....అవసరాన్ని బట్టి మిరియాలు
9....అవసరాన్ని బట్టి పిస్తా ప్పు
10...అవసరాన్ని బట్టి జీడిపప్పు
11...అవసరాన్ని బట్టి కుంకుమ పువ్వు
12...1 కప్ నీళ్ళు
డ్రై ఫ్రూట్  మిల్క్   షేక్ తయారు చేయు విధానం చూడండి.....
ఓ బౌల్ తీసుకుని అందులో బాదం, జీడిపప్పు, పిస్తా ప్పులు, సోంపుని, గులాబీ రేకులు, గసగసాలు, నల్లమిరియాలు, కర్బూజ గింజలు, యాలకులు వేయాలి. వీటన్నింటిని గోరువెచ్చని నీటితో 4 గంటల పాటు నానబెట్టండి. ఇందులోనే కొద్దిగా కుంకుమపువ్వు వేయండి....
ఒక్కసారి పదార్థాలన్ని బాగా నానిన తర్వాత ఆ నీటితోనే మిక్సీ  జార్‌లో వేసుకుని మంచి పేస్టులా చేయండి. దీనిని ఓ క్లాత్ ద్వారా వడకట్టండి. ఇలా వచ్చిన జ్యూస్‌నే థండాయ్ లేదా డ్రై ఫ్రూట్  మిల్క్ షేక్   అంటారు. దీనిని ఓ 15 రోజుల పాటు కూడా ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. ఎప్పుడు మీకు థండాయ్ చేయాలనుకుంటారో అప్పుడు దీన్ని ఉపయోగించొచ్చు.
ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని అందులో 4 టీ స్పూన్ల పంచదారని వేయండి. ఇప్పుడు అందులోనే 2 గ్లాసుల చల్లని పాలని వేయండి. అందులో థండాయ్‌ని కలపండి. మిశ్రమం బాగా కలిసేలా ఓ సారి బాగా కలపండి.ఎంతో టేస్టీగా ఉండే థండాయ్ రెడీ అయినట్లే. దీనిని చల్లగా తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది.ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా  హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: