రుచికరమైన అరటి పువ్వు వడని ఎలా చెయ్యాలో తెలుసుకోండి....!!!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి... అరటిపువ్వు వడ ఎంత రుచికరమైన వంటో అందరికి తెలిసిందే. ఇది సౌత్ ఇండియాలోనే బాగా ఫెమస్ అయినా వంటకం. దీన్ని ఇష్టపడని దక్షిణ భారతీయుడు ఉండడు. అరటిపువ్వు ఇంకా సెనగపప్పుతో కరకరలాడే,రుచికరమైన అరటి పువ్వు వడలు తయారుచేస్తారు. ఈ దక్షిణభారత వంటకం ముఖ్యంగా దీపావళి, ఇతర పండగలప్పుడు వండుతారు. అరటిపువ్వు వడని తమిళనాడులో వఝైపూ వడై అని కూడా పిలుస్తారు. మరి ఆ రుచికరమైన రెసిపీ వివరాలు ఇండియా హెరాల్డ్ అందిస్తున్న  ఈ ఆర్టికల్ లో తెలుసుకుని ఈ పండగ సీజన్లో వండుకుని ఆనందించండి.
అరటిపువ్వు వడ తయారీకి కావాల్సిన పదార్ధాలు...
ప్రధాన పదార్థం....
1  అరటి పువ్వు....
ప్రధాన వంటకానికి....
1 కప్ రాత్రంతానానబెట్టినవి సెనగ పప్పు...
3 కప్ రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె....
1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర....
1 కప్ కోయబడినవి ఉల్లిపాయలు...
4  ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు....
అవసరాన్ని బట్టి ఎండు మిరపకాయలు...
అవసరాన్ని బట్టి కరివేపాకు....
అవసరాన్ని బట్టి ఉప్పు...
8 పాయలు  వెల్లుల్లి....
1 1/2 టీ స్పూన్ జీలకర్ర....
అరటిపువ్వు వడని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...
మిక్సీలో సెనగపప్పు, తరిగిన ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి అన్నిటినీ పేస్టులా మిక్సీపట్టండి.

అరటిపువ్వును చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
ఒక పెద్ద గిన్నెలోకి రుబ్బిన పేస్టును తీసుకుని తరిగిన అరటిపువ్వును కలపండి.
తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు, జీలకర్ర, కొత్తిమీర ఇంకా ఉప్పును వేయండి. అన్ని పదార్థాలను చక్కగా కలపండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముద్దని తీసుకుని వడ ఆకారంలో చేతిమీద అద్దుకోండి.
ఒక పెనంలో నూనె వేసి వేడిచేయండి. నూనె మరిగాక, అరటిపువ్వు వడ మిశ్రమాన్ని నూనెలో వేసి బంగారు రంగులోకి మారేవరకూ వేయించండి.
చట్నీతో వేడిగా వడలను వడ్డించండి లేదా టీ సమయంలో టీతోపాటు ఆనందించండి.
ఇంకా ఇలాంటి కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: