హెరాల్డ్ స్పెషల్ కర్రీ : ఎంతో రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై కర్రీ మీకోసం.. !!
కావలిసిన పదార్ధాలు :
చికెన్ లివర్ -250 గ్రాములు
పసుపు - 1/4 స్పూన్
ఉప్పు- తగినంత (1/2 స్పూన్)
కారం -1 టీస్పూన్
ఉల్లిపాయ -1
పచ్చిమిర్చి -1
నూనె - 2 టేబుల్ స్పూన్
నిమ్మకాయ రసం -1/2 స్పూన్
కొబ్బెరి ముక్కలు -2 టేబుల్ స్పూన్లు
ధనియాలు -1 టేబుల్ స్పూన్
లవంగాలు -4
చెక్క -1 అంగుళం
యాలకలు -2
అల్లం -1 అంగుళం
వెల్లులి రెబ్బలు -3
చికెన్ లివర్ ఫ్రై తయారు చేయు విధానం :
ముందుగా లివర్ ఫ్రై కోసం మసాలా తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లోకి కొబ్బరి ముక్కలు, ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకలు, అల్లం ,వెల్లులి రెబ్బలుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్టులా మిక్సీ వేసుకోవాలి. మసాలా రెడీ అయ్యాక స్టవ్ వెలిగించి ఒక కడాయిలో నూనె పోసుకుని ఉల్లిపాయముక్కలు, పచ్చి మిర్చి తరుగు వేసుకోవాలి.. ముక్కలు ఎర్రగా వేగాక రుబ్బిన మసాలాను వేసి 3 నిమిషాలు వేపుకోవాలి. తరువాత లివర్ ముక్కల్ని వేసి ఒక నిమిషం కలయబెట్టాలి. తరువాత ఉప్పు, కారం , పసుపు వేసి ఇంకొక 5 నిమిషాలు వేయించుకోవాలి.ముక్కలు నూనెలో బాగా వేగితేనే బాగుంటాయి. చివరిగా కొత్తిమీర చల్లుకుని నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి.అంతే చికెన్ లివర్ ఫ్రై రెడీ.ఒక్కసారి మీరు కూడా చేసి చుడండి చాలా రుచిగా ఉంటుంది. చారు పెట్టుకుని ఫ్రై నంచుకుని తింటే చాలా బాగుంటుంది.. !!