నోరూరించే మిర్చీ బజ్జీలు టేస్టీ గా చేసుకోండిలా...

Purushottham Vinay
బజ్జీ.. బజ్జీ అంటే అల్పాహారం మాత్రమే కాదు. బజ్జీ అంటే ఒక ఎమోషన్. బజ్జీ ని ఇష్టపడని వారు ఎవరు వుండరు. వేడి వేడి బజ్జీ ని కొరుకుతుంటే.. వాహ్.. ప్రాణం జివ్వుమంటుంది. పైగా ఈ వర్షా కాలంలో, సాయంత్రం వేలలో బజ్జి అనేది మంచి అల్పాహారం అని చెప్పొచ్చు. ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఈ రుచికరమైన బజ్జీ ని  సులభంగా చేసుకోవచ్చు. సాయంత్రం వేళలో లో ఇవి టీతో చాలా బాగుంటాయి. మరి ఈ రుచికరమైన బజ్జీ ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చూడండి...
ముందుగా బజ్జీ కి కావాల్సిన పదార్ధాలు....
ప్రధాన పదార్థం..
అవసరాన్ని బట్టి సెనగ పిండి
అవసరాన్ని బట్టి చిల్లీ పికిల్
1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
అవసరాన్ని బట్టి నీళ్ళు
టెంపరింగ్ కోసం..
అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
ప్రధాన వంటకానికి..
1 టీ స్పూన్ సోపు
1 టీ స్పూన్ కారప్పొడి
అవసరాన్ని బట్టి ఉప్పు
అవసరాన్ని బట్టి పసుపు
అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా
తయారుచేయు విధానం...

ముందుగా ఓ బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయండి, వీటన్నింటిని ముందుగానే ఓ సారి కలపండి.
ఇప్పుడు పిండి మిశ్రమంలో ఓ స్పూన్ ఆయిల్ వేసి మరోసారి కలపండి. ఇందులో నీరు పోసి బజ్జీల పిండిలా కలపండి.
ఇప్పుడు పచ్చి మిర్చిలకు మధ్యలో చీల్చండి.. ఇప్పుడు మధ్యలో కొద్దిగా కారం రాయండి. ఇలా చేయడం వల్ల బజ్జీలు స్పైసీగా, టేస్టీగా వస్తాయి.
ఇప్పుడు పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయండి.నూనె వేడి అయిన తర్వాత మిర్చిలను పిండిలో ముంచి నూనెలో వేయండి. వీటిని కాస్తా దోరగా వేయించండి.
వీటిని వేడివేడిగా టమాటా సాస్‌తో కానీ, ఉల్లిపాయ కాంబినేషన్‌తో తింటచే చాలా బావుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: