రుచికరమైన మీఠా పారే.. ఈజీగా చేసుకోండి ఇలా...

Purushottham Vinay
స్వీట్ రెసిపీస్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. గృహిణిలు రకరకాల స్వీట్స్ తయారు చేస్తూ వుంటారు.గులాబ్ జామ్, పాలకోవా, లడ్డూలు, జిలెబీలు, పూతరేకులు, కజ్జి కాయలు ఇలా అనేక రకాల స్వీట్లు చేస్తుంటారు.వాటిన్నికంటే చాలా సులభంగా ఈ స్వీట్ మీఠా పారే చాలా ఈజీ గా తక్కువ టైం లో చెయ్యొచ్చు.  ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీ మీఠా పారే ని కూడా ట్రై చెయ్యండి.  మీఠా పారేను ఉత్తర భారతదేశంలో షక్కర్ ‌పారా, షక్కర్‌ పారే అని కూడా అంటారు. ఇది సాధారణంగా ఉత్తర భారతీయులు తరచుగా చేసుకునే సాంప్రదాయక ఆహారంలో ఇది ఒకటి. ఈ స్వీట్ సాయంత్రం టీ - టైం లో స్నాక్స్ కోసం సెలక్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, ఈ మీఠా పారే స్వీట్‌ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ డిష్ గొప్పదనం ఏంటంటే, దీన్ని ఏకంగా వారం పాటు గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్లలో నిల్వచేసుకుని తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ రుచికరమైన మీఠా పారేని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి...

ముందుగా కావాల్సిన పదార్ధాలు చూసుకున్నట్లైతే...
ప్రధాన పదార్థం..
250 గ్రాములు మైదా,
ప్రధానవంటకానికి...
3 టీ స్పూన్ నెయ్యి,
1/2 కప్ చక్కర,
అవసరాన్ని బట్టి నీళ్ళు తీసుకోవాలి.
తయారు చేయాల్సిన విధానం చూడండి...
ఒక గిన్నెను తీసుకుని, అందులో నీరు, చక్కెర వేసి బాగా కలపండి. చక్కెర పూర్తిగా నీటిలో కరిగేవరకు కలపండి. ఈ మిశ్రమంలో నెయ్యిని వేసి 3 నుండి 4 నిమిషాలపాటు మళ్లీ కలపండి. ఆపై అందులో మైదాని వేసి మెత్తని పిండిగా తయారుచేసుకోండి. ఈ పిండి మెత్తగా మారిన తర్వాత, 1 నుండి ఒకటిన్నర గంటల పాటు పక్కన ఉంచండి. కొంత సమయం తరువాత, రోలింగ్ ప్లేట్ (చపాతీ పీట) మీద పిండిని వేసి, పిండిని చిన్ని చిన్ని భాగాలుగా తయారు చేయండి. రోలింగ్ పిన్‌కు నూనె రాసి, పిండిని మందంగా ఫ్లాట్‌బ్రెడ్‌ లా చేయండి. ఈ ఫ్లాట్ బ్రెడ్ ను మీరు కోరుకున్న ఆకారంలో కట్ చేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు పాన్‌లో వేయించండి. టీ, సాయంత్రం స్నాక్స్ తో ఈ క్రంచీ మీఠా పారేను సర్వ్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎవరైనా స్పెషల్ గెస్ట్ లు కాని చుట్టాలు వచ్చినప్పుడు కాని ఈ స్వీట్ అండ్ టేస్టీ రెసిపీ ని కచ్చితంగా తినిపించండి. కచ్చితంగా వారు ఎంతగానో ఈ రెసిపీ ని ఇష్టపడతారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: