వంటా వార్పు: నోరూరించే `చికెన్ టిక్కా` ఎలా చేయాలో తెలుసా?
కావాల్సిన పదార్థాలు:
చికెన్ - ఒక కేజీ
పెరుగు - ఒక కప్పు
పసుపు - పావు టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాలపొడి - అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
బిర్యానీ మసాలా - అర టీ స్పూన్
కారం - ఒక టీ స్పూన్
మిరియాలపొడి - అర టీ స్పూన్
గరంమసాలా - అర టీ స్పూన్
సెనగపిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్
నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర తురుము - పావు కప్పు
తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో చికెన్ తీసుకొని... నిమ్మరసం కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి సెనగపిండి, కారం, పసుపు, మిరియాలపొడి, గరం మసాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాల, ఉప్పు, ధనియాలపొడి వేసి బాగా కలుపుకోవాలి.
చివరగా ఈ మిశ్రమానికి పెరుగు మరియు తురిమిన కొత్తిమీర వేసి.. బాగా కలిపి అరగంట నుంచి గంట వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి చికెన్ ముక్కలను ఇనుప పుల్లలకు గుచ్చుకొని... నిప్పులమీద కాల్చాలి.
అన్ని వైపులా కాలేలా... పుల్లలు తిప్పుతూ ఉండాలి. అవసరమైతే కాల్చే సమయంలో ముక్కలపై బటర్ కానీ, కొద్దిగా ఆయిల్ గాని వేసుకొని కాల్చుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే నోరూరించే చికెన్ టిక్కా రెడీ. వేడి వేడిగా వీటిని తింటే అదిరిపోతుంది. కాబట్టి, మీరు కూడా ఈ టేస్టీ చికెన్ టిక్కా రెసిపీని తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి.