హెరాల్డ్ స్పెషల్ కర్రీ:  ఘుమ ఘుమలాడే చాపల పులుసు తయారీ విధానం ...!

Suma Kallamadi

అబ్బా చేపల పులుసు పేరు వింటే అందరికి నోరు ఊరిపోతోంది కదా...! ఎంతో  అద్భుతమైన రుచి కలిగి నటువంటి  ఫిష్ కర్రీ  చాలా రుచికరంగా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఫిష్ కర్రీ(చేపల పులుసు) సౌత్ ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి రిసిపి.ఇది వండడం కష్టం అనుకుంటారు కొంతమంది. కానీ చాలా సులువు అండి..  సాధారణంగా ఈ ఫిష్ కర్రీ వండిన రోజుకంటే, మరుసటి రోజున చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి, ఈ ఫిష్ కర్రీని ప్రిజ్ లో ఉంచి మరొసటి రోజు కూడా తినవచ్చు. చేపల ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టి మరుసటి రోజుకి ఇంకా బాగుంటుంది పులుసు. 

 

 

అలాగే చేపలతో తయారుచేసిన వంటలు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచి  ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ను తినడం వల్ల గుండె మరియు మెదడును ఆరోగ్యంగా చురుకుగా ఉంచుకోవచ్చు. డిప్రెషన్ తగ్గిస్తుంది మరియు ఆర్థరైటిస్ ను నివారిస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ చేర్చుకోండి.అలాగే చేపలు తినడం వల్ల కళ్ళకి చాలా మంచింది. అనవసరమైన కొవ్వు కూడా శరీరానికి పట్టదు. ఇప్పుడు నోరూరించే ఘుమఘుమలాడే చేపల పులుసు తయారీ విధానం చూద్దాము. 

 

కావలసిన పదార్దాలు :

చేప ముక్కలు : 1/2kg

కారం : 1tbsp

పసుపు: 1/4tsp

జీలకర్రపొడి: 1/2tsp

మిరియాలపొడి: 1/2tsp

ఉప్పు: రుచికి తగినంత

అల్లం వెల్లుల్లి పేస్టు : 2tsp

నూనె : తగినంత

జీలకర : 1tsp

ధనియాలపొడి : 1/2tbsp

ఉల్లిపాయలు: 3 (బారుగా కట్ చేసుకోవాలి)

కొత్తిమీర : రుచికి సరిపడా కొంచెం 

చింతపండు గుజ్జు : 50 గ్రాములు. 

పచ్చి మిర్చి : 4(మద్యలోకి కట్ చేసుకోవాలి)

ఉల్లిబొందు : కొంచెం 

 

 

 

తయారీ విధానం:

ముందుగా  చేపలను   ఒక   గిన్నెలో  తీసుకోని  కళ్ళు ఉప్పుతో  శుభ్రంగా కడగాలి  దీని  వలన  మనకు  చేపలు  నీచు  వాసన రాకుండా శుభ్రంగా   ఉంటాయి . తర్వాత  చేపముక్కలని  చేపల కూర వండే  వెడల్పాటి  పాత్రలో ఉంచి ఆ ముక్కలకి   ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఒక  15 నిమిషాలపాటు నానబెట్టాలి. తర్వాత చింతపండు పిసికి గుజ్జు ని పారేసి చింతపండు రసాన్ని ముందుగా నానపెట్టి ఉంచుకున్న చేపముక్కలో పోయాలి. తర్వాత  ఆ పాత్రలోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం సరిపడా మళ్ళీ వేయాలి.అలాగే సరిపడా నూనె కూడా పోయాలి. అన్ని ముందుగానే ఆ పాత్రలోనే కలిపిపెట్టుకోవాలి.. ఇలా చేయడం వాళ్ళ చేప ముక్క అనేది విడిపోకుండా అలాగే ఉంటుంది. కొంతమంది ఒక్కోటి ఒక్కోసారి పోయి మీద పెట్టి వేపుతూ చేస్తారు.. అలా చేయడం వల్ల ముక్కలు అన్ని విడిపోయి కూరలో కలిసిపోతాయి. 

 

 


పోయి మీద పెట్టేముందు  ముందుగా కడిగి శుభ్రం చేసిపెట్టుకున్న  ఉల్లి బొందుని చిన్న చిన్న ముక్కలుగా కోసి చేపల పులుసు లో వేయాలి. తర్వాత గరిటెతో అన్ని చక్కగా కలిపి స్టవ్ వెలిగించి ఎక్కువ మంటతో 10 నిముషాలు ఉడకనివ్వాలి. గరిటతో తిప్పకూడదు ముక్కలు విరిగిపోతాయి. తర్వాత పులుసులో ఉప్పు, కారం చూసుకుని చాలకపోతే ఇంకా కొంచం వేసుకోవాలి. ఇప్పుడు మంట కొంచెం తగ్గించి తక్కువ లో మరొక 10 నిముషాలు ఉడకనివ్వాలి.. కూరలో నూనె మనకి కనిపిస్తుంది పైకి. అలా వచ్చే దాక ఉంచుకోవాలి.. పులుసు ఎక్కువ కావాలని అనుకునే వాళ్ళు ముందే దించుకోవాలి.. తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం సేపు ఉంచుకోవాలి.. చివరలో కొత్తిమీర  వేసుకుని పొయ్యిమీద నుంచి దించి కొంచెం సేపు చల్లారాక ఆరగించండి.. ఇంతే చాలా సింపుల్ ఎంతో రుచుకరమైన "చేపల పులుసు " రెడీ. ఆలస్యం చేయకుండా తినేయండి..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: