జీలకర్ర రైస్.. ఎంత ఆరోగ్యమో తెలుసా?

Durga Writes

ప్రస్తుత పరిస్థితుల్లో మనం కొంచం ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి అందరిని పీక్కుతింటుంది. ఇంకా ఈ సమయంలో మిరియాలు.. జీలకర్ర.. లవంగాలు.. వెల్లుల్లి వంటివి తిని ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి రోగాలు రావు. అయితే ఇప్పుడు జీలకర్ర రైస్ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు.. 

 

బియ్యం - ఒక కేజీ

 

జీలకర్ర - 50 గ్రా.

 

కొత్తిమీర - ఒక కట్ట

 

ఉల్లిపాయ - ఒకటి

 

నూనె - 100 గ్రా.

 

వేడి నీళ్లు - రెండున్నర లీటర్లు

 

ఉప్పు - రుచికి సరిపడా

 

తయారీ విధానం... 

 

బియ్యాన్ని కడిగి పక్కన పెట్టాలి. 15 నిమిషాల తరువాత నీటిని వంపేసి బియ్యాన్ని పక్కన పెట్టాలి. ఆతర్వాత పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడించాలి అని ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నటి మంటమీద బాగా వేయించాలి అని.. అందులోనే ఉప్పు, వడబోసి ఉంచిన బియ్యాన్ని వేసి ఉల్లిపాయ ముక్కలు, జీరా బియ్యంలో కలిసేవిధంగా కలిపి ఆతర్వాత రైస్ చెయ్యాలి. అంతే జీలకర్ర రైస్ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: