వంటా వార్పు: పిల్లలు ఎంతగానో ఇష్టపడే `మఫిన్స్` ఎలా చేయాలో తెలుసా..?
కావాల్సిన పదార్థాలు:
మైదాపిండి- పావుకిలో
చక్కెర పొడి- 200 గ్రా
కోకోపౌడర్- రెండు స్పూన్లు
డాల్డా- పావుకిలో
బేకింగ్ సోడా- అర టీ స్పూన్
చాకొలేట్ చిప్స్- మూడు స్పూన్లు
చాకొలేట్ టీ టైమ్ మిక్స్- ఒక టీ స్పూన్
బట్టర్- ఒక టీ స్పూన్
గుడ్లు- ఐదు
జీడిపప్పు- కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో ఎగ్స్‌ను పగలకొట్టి.. అందులో కొద్దికొద్దిగా చక్కెర పొడి కలిపి గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా మైదాపిండి, కోకోపౌడర్, బేకింగ్‌సోడా, చాకొలేట్ చిప్స్ కలిపి కాసేపు బాగా కలపాలి.
ఇప్పుడు బటర్ పూసిన గిన్నెలో ఈ మిశ్రమాన్ని పోసి ఓవెన్‌లో 160- 180 డిగ్రీల వద్ద సుమారు ఇరవై నిముషాలు బేక్ చేసి తీశాక ఆరిన తర్వాత జీడిపప్పు, చెర్రీ పలుకులతో చల్లితే సరిపోతుంది. అంతే పిల్లలు ఎంతగానో ఇష్టపడే మఫిన్స్ రెడీ..!