కావాల్సిన పదార్థాలు:
చికెన్ ముక్కలు - అరకేజీ
వెల్లుల్లి పేస్ట్ -1/2 టీ స్పూన్కా
క్రీమ్- 1 కప్పు
పచ్చిమిర్చి - 6
కారం - 1/2 టీ స్పూన్
నిమ్మరసం- 1/2 టీ స్పూన్
గరం మసాల - 1 టీ స్పూన్
బ్రెడ్ పొడి- కొద్దిగా
ఉప్పు- తగినంత
నూనె- సరిపడా
కార్న్ ఫ్లోర్ - 1 కప్పు
ఇంగువ - 1/4 టీ స్పూన్
ధనియాల పొడి - 1/2 టీ స్పూన్
జీలకర్రపొడి - 1/2 టీ స్పూన్
తయారీ విధానం:
ముందుగా చికెన్ ముక్కలను వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో జీలకర్ర, దనియాల పొడి, కారం, వెల్లుల్లి పేస్ట్ మరియు కార్న్ ప్లోర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. తర్వాత అందులో చికెన్ ముక్కలు, సన్నగా తరిగిని పచ్చిమిర్చి, నిమ్మరసం కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. అలాగే అందులో క్రీమ్ కూడా వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి, నూనె వెడి అయ్యాక అందులో చికెన్ పీసెస్ ను బ్రెడ్ పొడిలో రోల్ చేసి తర్వాత కాగే నూనెలో వేసి డీఫ్ ప్రై చేసుకోవాలి. చికెన్ స్టిక్స్ క్రిస్పీగా, బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే స్పైసీ స్పైసీ చికెన్ స్టిక్స్ రెడీ..!