అత్యాచారం చేయబోయిన వ్యక్తిని చంపిన యువతి.. కోర్టు ఏం శిక్ష వేసిందంటే?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ఇక ఇలా వెలుగులోకి వచ్చే ఘటనలు మహిళల భద్రతను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా మహిళలపై అత్యాచారం చేసే వారికి కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తున్న.. కామాంధుల తీరులో మాత్రం అసలు మార్పు రావడం లేదు. వెరసి ఆడపిల్ల ఇల్లు దాటి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లో.

 ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గ ముఖం పట్టడం లేదు. అయితే కొంతమంది మహిళలు కామాంధులు వేధింపులకు పాల్పడుతున్న సమయంలో భయపడి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం ఆడది అబలా కాదు సబల అన్న విషయాన్ని నిరూపిస్తున్నారు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన నీచులపై అపర ఖాళీలా మారి సరైన బుద్ధి చెబుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఒక యువతి ఇలాంటిదే చేసింది. తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కామాంధుడుని మట్టు పెట్టింది.

 అయితే ఇలా ఆత్మ రక్షణ కోసం అత్యాచారం చేయబోయిన వ్యక్తిని చంపేసిన ఆ యువతీకి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించడం గమనార్హం. కమిటీతో మహిళా సంఘాలు హ్యూమన్ రైట్స్ న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ ఉండడం గమనార్హం. మెక్సికోలో ఈ ఘటన జరిగింది. 2021 లో ఒక కామాంధుడు యువతిపై దాడి చేసి అత్యాచారం చేశాడు. అదే సమయంలో అతడిని బాధిత యువతి దారుణంగా హత్య చేసింది. అయితే ఇక ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మృతుడి కుటుంబానికి 13 లక్షల పరిహారం ఇవ్వాలంటూ కోర్టు చెప్పింది. అయితే బాధితురాలు తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ బాధిత యువతికి ప్రతిఘటించే.. హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. ఇక యువతికి మద్దతుగా స్త్రీవాద సంఘాలు నిరసన ప్రదర్శనలు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: